టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్
సినిమా నుండి వచ్చిన నాటు నాటు పాట యూ ట్యూబ్ ని షేక్ చేస్తుంది. యూ ట్యూబ్ లో వ్యూస్ రికార్డుల మోత మ్రోగిస్తోంది. ఇక తక్కువ సమయంలోనే పది మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న ఈ నాటు నాటు సాంగ్ ఇప్పుడు వంద మిలియన్ ల వైపు చాలా నాటుగా దూసుకు పోతుంది. ఈ పాట కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా హిందీ.. తమిళం.. మలయాళం ఇంకా అలాగే కన్నడంలో కూడా విడుదల అయ్యింది. మొత్తం అయిదు భాషల్లో ఈ పాట విడుదల అయ్యి దుమ్ము దులుపుతుంది. ఇక ఈ పాట కు ఇప్పటి వరకు కూడా ఏకంగా 75 మిలియన్ ల వ్యూస్ వచ్చినట్లుగా
సినిమా యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ పాట అన్ని భాషల వర్షన్ లు కలిపి ఈ మొత్తం వ్యూస్ ను
యూట్యూబ్ లో దక్కించుకున్నట్లుగా
మూవీ మేకర్స్ చెబుతున్నారు.
ఈ పాట కేవలం
యూట్యూబ్ లో మాత్రమే కాకుండా ఇతర సోషల్
మీడియా ప్లాట్ ఫామ్స్ ల్లో కూడా దూసుకుపోతూ సూపర్ డూపర్
సక్సెస్ అయ్యి పదుల మిలియన్ ల లిజన్స్ ను దక్కించుకుంటుంది. ఇక
రాజమౌళి సినిమా అంటే తన అన్న
కీరవాణి అద్బుతమైన సంగీతాన్ని అందిస్తాడు.. ఆ విషయం మరోసారి నిరూపించడం జరిగింది. ఈ పాటకు తారక్,
రామ్ చరణ్ లకు అద్బుతమైన డాన్స్ స్పెప్పులు కూడా కుదిరాయి.వీరి ఊర
మాస్ డాన్స్ స్టెప్పులకు కారణం
ప్రేమ్ రక్షిత్ మాస్టర్.దాంతో ఈ పాటను పదే పదే చూస్తున్నారు. అలాగే కొన్ని వేల మంది ఈ పాటతో కవర్ సాంగ్స్ చేశారు. కొన్ని లక్షల మంది ఈ పాటను తమ మొబైల్స్ లో డౌన్ లోడ్స్ చేసుకున్నారు. ఇంతగా పాపులర్ అయిన ఈ నాటు నాటు సాంగ్
సినిమా పై అంచనాలను తారా స్థాయికి పెంచేసింది.
ఇక
జక్కన్న చెక్కిన ఈ ఆర్ ఆర్ ఆర్
సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఈ పాట విడుదల తర్వాత అభిమానుల్లో చాలా ఆసక్తి ఎక్కువ అయ్యింది.ఇక ఇండియాలోనే పెద్ద పాన్
ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ ఆర్ ఆర్ ఆర్
సినిమా మరో అద్బుతమైన విజువల్ వండర్ గా
జక్కన్న దీన్ని తీర్చి దిద్దాడు అంటూ అభిమానులు ఇంకా అలాగే
ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఇక ఈ
సినిమా ట్రైలర్ ను వచ్చే నెల
డిసెంబర్ 3 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇక అప్పుడు ఈ
సినిమా ట్రైలర్
యూట్యూబ్ ను మరెంత షేక్ చేస్తుందో లేదో చూడాలి.