జాతీయ అవార్డు గెలుచుకున్న నేటి తరం మహానటి తెలుగు తమిళ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రథాన పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత అయినా దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో చేస్తున్న గుడ్ లక్ సఖి సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. గత ఏడాదిలోనే ఈ సినిమా విడుదల అవ్వాల్సి వుంది.కాని కరోనా మహమ్మారి వల్ల అదుగో ఇదుగో అంటూ ఈ వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఒకానొక సమయంలో ఈ సినిమాను ఓటీటీ వేదిక ద్వారా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా గట్టిగానే ప్రచారం జరిగింది. అలాగే ఈ సినిమా మేకర్స్ కూడా అటు వైపు అడుగులు వేస్తున్నారంటూ గట్టి వార్తలు వచ్చాయి. కాని ఏం జరిగిందో ఏమో కాని ఈ సినిమా మొత్తానికి థియేటర్ రిలీజ్ కు సిద్దం అయ్యింది. కొన్ని నెలల పాటు పూర్తిగా సైలెంట్ అయిన గుడ్ లక్ సఖి సినిమా మళ్లీ ఇప్పుడు హడావుడి మొదలు పెట్టడం జరిగింది.
ఇక డిసెంబర్ 10 వ తేదీన విడుదల కాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన అనేది వచ్చింది.ఇక వచ్చే వారంలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే సెన్సార్ బోర్డు ముందుకు సినిమా వెళ్లగా అక్కడ ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగిందట. ఇక ఈమద్య కాలంలో క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమాలు అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి.అలాగే జనాలు కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమాలను ఈ మధ్య కాలంలో అసలు ఆశించడం లేదు. కాని మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా అన్ని రకాల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని గతంలో నిరూపితం అయ్యింది.ఇక ఈ గుడ్ లక్ సఖి సినిమా చిత్రీకరణ సమయంలోనే కీర్తి సురేష్ లుక్ రివీల్ అవ్వడంతో అంతా కూడా ఈ సినిమాపై తారా స్థాయిలో భారీ అంచనాలు పెంచేస్తున్నారు.ఇక చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ నమోదు చేసి కీర్తికి మంచి బ్రేక్ ఇస్తుందో లేదో అని.