అఖండ : ప్రీమియర్ షో టికెట్ రూ.4 వేలు.. ఆంధ్రా నుంచి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ కు..!!

Anilkumar
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ. ఈ సినిమా డిసెంబర్ 2 అంటే ఇవాళ తెల్లవారుజాము నుండే ప్రపంచ వ్యాప్తంగా స్క్రీనింగ్ అయ్యింది. ఇకపోతే బాలకృష్ణ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇవాళ బాలకృష్ణ అఖండ సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిసి నందమూరి అభిమానులు ఎక్కడెక్కడి నుండో వచ్చి రాత్రంతా నిద్ర లేకుండా థియేటర్ల ముందు సినిమా కోసం చూస్తున్నారు. రాత్రంతా నిద్ర లేకుండా థియేటర్ల ముందు మెలకువగా ఉండి సందడి చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం బెనిఫిట్ షోలు ఏవి కూడా లేవట. కానీ మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వడంతో..

 ఆంధ్ర వాసులు అందరూ కూడా కలిసి డిసెంబర్ 2వ తేదీ తెల్లవారుజాము నుంచే థియేటర్ల ముందు సినిమా కోసం కాపు కాస్తున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్ అందరూ కలిసి  నిజాంపేట క్రాస్ రోడ్స్‌లో ఉన్న భ్రమరాంబ, మల్లిఖార్జున్ థియేటర్లలో బెనిఫిట్ షో  వేయడంతో  అక్కడి వారందరూ కలిసి థియేటర్ల ముందు సందడి చేయడం జరిగింది. అయితే ఇలాంటి వాళ్లకు టికెట్ల ధర ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే . అందులోనూ హైదరాబాద్ లో అన్ని రేట్లు కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి అందులోనూ టికెట్ల ధర మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే మామూలుగా అయితే ఒక టికెట్ రేటు రెండు వేల రూపాయలు ఉంటుంది.... కానీ నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమాకి మాత్రం..

 టికెట్ రేటు ఏకంగా 3500 చేశారు.. ఇంత ఎక్కువ ధరకు టికెట్ రేటు పెంచిన కూడా నందమూరి ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గకుండా టికెట్లు తీసుకుని సినిమా చూస్తున్నారు. అయితే మరో వైపు నందమూరి ఫ్యాన్స్ టికెట్ రేటు ఏ రేంజిలో పెంచిన కూడా ఏ మాత్రం తగ్గకుండా టికెట్లను కొంటాము... మొదటి రోజే మా బాలయ్య సినిమా నేను చూస్తాను అంటూ ఎంతో ఉత్సాహంతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సినిమాను చూడటానికి బాలయ్య ఫ్యాన్స్ ఏకంగా 350 బస్సులలో హైదరాబాద్ కు రావడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడే బాలయ్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటో తెలుస్తోంది. అయితే సినిమా రిలీస్ కాకముందు నుంచి బాలయ్య ఫ్యాన్స్ థియేటర్ల ముందు రచ్చ రచ్చ చేశారు.బాలయ్య ఇంకా బాలయ్య నటించిన అఖండ సినిమాకి సంబంధించిన భారీ సినిమా కటౌట్లను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు బాలయ్య ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: