ఈరోజు బాలయ్య నటించిన అఖండ సినిమా విడుదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈరోజు థియేటర్ల దగ్గర సంబరాలు జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల దగ్గర ఎక్కడ చూసినా కూడా బాలయ్య కటౌట్లతో నింపేశారు. అంతేకాకుండా బాలయ్య కటౌట్ లకు పూజలు చేయడం దండలు వేయడం హారతి ఇవ్వడం చేస్తున్నారు. బాలయ్య అభిమానులు అనుకున్న దాని ప్రకారమే అఖండ సినిమా గొప్ప విజయాన్ని అందుకుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమా విషయం ఇలా ఉంటే అసలు సినిమాలో ఉన్నది బలయ్యేనా..?ఆ నటన బాలయ్య దేన..? బాలయ్య యంగ్ హీరో ఏమీ కాదు.? అలాగని మామూలు హీరో కూడా కాదు...
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఈ సూపర్ హీరోయిన్ బాలయ్య కి పోటీగా రాగలరా..? బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలొని యాక్షన్ లతో జనాలకు పిచ్చెక్కించాడు. సినిమాలోని యాక్షన్ సీన్స్ కు ఫైట్ సీన్స్ కు బాలయ్య ఎంత కష్టపడ్డాడో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆయన చేసిన ఫైట్ సీన్స్ చూస్తే ఇప్పటి వరకు ఏ హీరో కూడా అలా చేసి ఉండడేమో అని అనిపిస్తుంది. సినిమాలు పెద్ద పెద్ద సీన్స్ చేసేటప్పుడు కొన్ని కొన్ని ప్రమాదాలు తప్పవు... అలాగే ఈ సినిమాలో బాలయ్యకు తన చేతికి గాయం అయింది.. ఇప్పుడు బాలయ్య చేతికి ఉన్న ఆ కట్టు ఆ ప్రమాదానికి గుర్తు. సినిమాలు ఎలాంటి ప్రమాదం జరిగిన కూడా ఆపకుండా సినిమా చేయాలి అంటే అది బాలయ్యకే సాధ్యం.
సినిమాలో అదిరిపోయే స్టెప్పులు తో అందరినీ అలరించారు బాలయ్య. ఇంత వయసులో కూడా అందరినీ తన యాక్షన్ తో ఆకట్టుకోవడం అనేది అంత సాధ్యమైన పని కాదు. అయితే చాలా మంది హీరో హీరోయిన్లు వేరే ఎవరైనా చూసి ఏదో నేర్చుకుందామని గొప్పలుపోతారు. కానీ బాలయ్య ని చూసి వారు చాలా నేర్చుకోవచ్చు. సినిమా కి తగ్గట్టు రెమ్యూనరేషన్ తీసుకున్నా మా సినిమా చేశామా అన్నట్టుగా కాకుండా సినిమా కి తగిన న్యాయాన్ని సమకూర్చాలి అనేది బాలయ్య బాబు ని చూసి నేర్చుకోవాలి. అంతేకాకుండా బాలయ్య ని చూసి ముందుగా టైమింగ్ సెన్స్ నేర్చుకోవచ్చు.అన్నిటికి మించి ఎలా నిబద్దత ఉండాలో.. ఎలా క్రమశిక్షణతో ఉండాలో బాలయ్య ని చూసి నేర్చుకోవచ్చు.