బాలీవుడ్ డిమాండ్స్ కు కన్ఫ్యూజ్ అవుతున్న రాజమౌళి !
‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పాటలు అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో ఈమూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఆమధ్య ఈమూవీకి సంబంధించిన ‘జనని’ పాటకు కూడ విపరీతమైన స్పందన వచ్చింది. అలనాటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ట్యూన్ చేయబడ్డ ఆపాట ఈనాటితరం వారికి బాగా నచ్చడమే కాకుండా అలనాటి స్వాతంత్రోద్యమ జ్ఞాపకాలలోకి నేటితరం ప్రేక్షకులను తీసుకు వెళ్ళడంలో సక్సస్ అయింది.
వాస్తవానికి ఈ ‘జనని’ పాటకు లక్షల సంఖ్యలో హిట్స్ వచ్చినప్పటికీ బాలీవుడ్ వర్గాలు ముఖ్యంగా ఈసినిమాను బాలీవుడ్ లో కొనుక్కున్న బయ్యర్లు ఈసినిమా పై మరింత క్రేజ్ పెంచడానికి రామ్ చరణ్ అలియా భట్ లపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ కు సంబంధించిన వీడియోను విడుదల చేయమని రాజమౌళి పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం అలియా భట్ కు బాలీవుడ్ లో కొనసాగుతున్న మ్యానియా రీత్యా ఆమెను గ్లామర్ క్వీన్ గా చూపెడుతూ చరణ్ అలియా లపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ విడుదల చేస్తే ఈమూవీకి ఉత్తరాదిన మరింత క్రేజ్ వస్తుంది అన్నది బాలీవుడ్ వర్గాల అభిప్రాయం అని తెలుస్తోంది.
అయితే ఈవిషయంలో రాజమౌళి అభిప్రాయలు వేరుగా ఉన్నాయి అని అంటున్నారు. ఈమూవీలో సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ పాత్ర చాల ఉదాత్తమైనది. దీనితో ఈమూవీలోని ఆమె పాత్రను చాల గంభీరంగా తీర్చిదిద్దాడు రాజమౌళి. అయితే మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని చరణ్ అలియా భట్ లపై చిత్రీకరించిన ఈగ్లామర్ సాంగ్ ను ఇప్పుడు విడుదల చేస్తే ఈమూవీ పై వస్తున్న ఉదాత్త భావం తగ్గిపోతుందని రాజమౌళి ఆలోచన అంటున్నారు. అయితే ఈవిషయంలో బాలీవుడ్ వర్గాల అభిప్రాయం వేరుగా ఉంది కాబట్టి ఏమిచేయాలి అన్న అంతర్మధనంలో జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది.
ఈసినిమాకు సంబంధించి ఎంతోమంది నటీనటులు నటిస్తున్నప్పటికీ అలియా భట్ కు ఉన్న క్రేజ్ రీత్యా కేవలం 15 నిముషాలు మాత్రమే ఉండే ఆమె పాత్ర కోసం ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ ఆమెకు 6 కోట్లు పారితోషికం ఇచ్చింది అన్నప్రచారం జరుగుతోంది. చరణ్ జూనియర్ లకు బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పరచాలని రాజమౌళి ప్రయత్నిస్తుంటే బాలీవుడ్ వర్గాలు మాత్రం అలియా భట్ ప్రాముఖ్యత గురించి ఆశక్తి చూపించడం ఆమె మ్యానియాకు నిదర్శనం అనుకోవాలి..