రవితేజ అదృష్టం బాగుంది.. జస్ట్ లో మిస్ అయ్యాడు..!!

Anilkumar
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఖిలాడి సినిమా షూటింగ్ పూర్తి చేసిన రవితేజ.. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టులు కూడా ఓకే చేశాడు రవితేజ. ఇక గత ఏడాది క్రాక్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని శుభారంభం చేశాడు. ఈ సినిమా కంటే ముందు రవితేజ నటించిన టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంథోనీ, డిస్కో రాజా వంటి వరుస చిత్రాలు ఫ్లాపులుగా మిగిలాయి. దీంతో క్రాక్ తర్వాత విజయాన్ని అందుకొని తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

 ఇప్పటికే వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తున్నప్పటికీ కథ నచ్చక పోతే వాటిని రిజెక్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రవితేజ అదృష్టం బాగుంది అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే క్రాక్ సినిమా తర్వాత రవితేజ ఓ డిజాస్టర్ చిత్రం నుంచి తప్పించుకున్నాడు. తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన 'అనుభవించు రాజా' అనే సినిమా విడుదలై నిరాశపరిచింది. గవిరెడ్డి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి జంటగా కాశీస్ ఖాన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా దర్శకుడు ఈ చిత్ర కథ తో మొదట రవితేజను సంప్రదించారట. అయితే రవితేజ ఈ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేశాడట. నిజానికి రవితేజ బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యే కొన్ని అంశాలు ఈ కథలో ఉన్నాయి.

 కానీ కథ మొత్తం పూర్తి బలంగా లేకపోవడం తో రవితేజ ఈ చిత్రానికి నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రవితేజ తర్వాత దర్శకుడు రాజ్ తరుణ్ ని సంప్రదిస్తే ఈ స్క్రిప్ట్ కి రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశే మిగిల్చింది. దీంతో రవితేజ చాలా తెలివిగా వ్యవహరించి పెద్ద పరాజయం నుంచి తప్పించుకున్నాడు అని పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం రవితేజ తన స్టోరీ సెలెక్షన్ విధానాన్ని పూర్తిగా మార్చేస్తూ కంటెంట్ ఉన్న కథలకే మొగ్గు చూపుతున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: