వామ్మో..అనసూయ "పుష్ప" సినిమాలో అంత పని చేసిందా..?
హాట్ లుక్స్ తోనే కాదు భయంకరంగా భయపెడుతూ కూడా అభిమానులను ఆకట్టుకుంది. సుకుమార్ ఆమె పాత్రను అలా డిజైన్ చేసారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ నెగిటివ్ రోల్ లో నటించనుంది. ఈ సినిమా అమ్మడు సునీల్‌కు భార్యగా..ఆయనను కంట్రోల్ చేసే గయ్యాళి పెళ్లాం గా కనిపిస్తుందని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక ఈ సినిమాలో అనసూయ ఎంత కురంగా ఉంటుందంటే.. ఓ విషయంలో సునీల్ తన మాట వినలేదని..అందరి ముందు తనని అవమానించాడని..అనసూయ సొంత భర్తనే బ్లేడ్ తో గొంతు కోసి చంపేస్తుందని ప్రచారం జరుగుతుంది.
ఇక దీని బట్టి సుకుమార్ అనసూయ పాత్రను ఎంత వైల్డ్ గా రాసుకున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాత్ర అనసూయదే అంటూ సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అనసూయ ఈ సినిమాలో రష్మికను కూడా డామినేట్ చేసిందంటూ అక్కడ పని చేసే వాళ్లు చెబుతున్నారట. మరి చూడాలి అనసూయ ద్రాక్షాయణిగా ఎలా ముద్ర వేసుకుంటుందో..మనల్ని ఎలా మెప్పిస్తుందో. పుష్ప సినిమా క్రిస్మస్ పండుగ కానుకగా ఈ నెల 17 న రిలీజ్ కానుంది.