మాస్ మహారాజ
రవితేజ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన
క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నారు. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న
రవితేజ దాని తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
రవితేజ నటించిన
క్రాక్ ఈ
సినిమా తర్వాత వరుసగా ఐదు సినిమాలను చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు రవితేజ. అయితే ఇటీవల
రవితేజ తన 67వ సినిమా...
రమేష్ వర్మ దర్శకత్వంలో రానున్న కిలాడి
సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'.
శరత్ మండవ దర్శకత్వంలో యసెల్వీ సినిమాస్ పతాకంపై రవితేజ నటించిన ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో హీరోగా
రవితేజ నటిస్తున్నప్పటికీ దివ్యాన్ష్ కౌశిక్, మలయాళ కుట్టి రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా
రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో ఈ
సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర బృందం ఇప్పుడు మరోసారి ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ను అందించింది. అయితే ఈసారి చిత్రబృందం ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటించింది.
మాస్ మహారాజ్ నటించిన ఈ
సినిమా వచ్చే ఏడాది
మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న టు గా ఒక
పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.
ఇక ఈ వార్త విన్న
రవితేజ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇకపోతే ఈ సినిమాకి
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. అంతేకాకుండా
రవితేజ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న ' ధమాకా' సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసినట్టు గా తెలుస్తోంది. అంతేకాకుండా
రవితేజ పాటు
సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. అయితే త్వరలోనే కిలాడీ
సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి
రవితేజ ఫ్యాన్స్ ఎంతగానో అలరించనుంది. దీని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు
రవితేజ అభిమానులు...!!