'ఇల్లు కట్టడమే కష్టమైంది.. ఇక పెళ్లంటే'.. పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్..!!

Anilkumar
ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజా హెగ్డే. ఇప్పటికే అగ్రహీరోల సరసన పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ వచ్చే ఏడాది నుంచి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఇక వచ్చే ఏడాది నుంచి పూజా హెగ్డే నటించిన సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల కాబోతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరోయిన్ ఒక ఇంటర్వ్యూ లో తన వివాహం గురించి మాట్లాడుతూ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. వివాహం పై తన అభిప్రాయం ఏమిటి అని అడగ్గా దానికి ఒక ఆసక్తికరమైన సమాధానం చెప్పింది పూజా హెగ్డే." ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటారు మన పెద్దలు" ..

ఎందుకంటే అవి చేసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.' ఈమధ్యనే ముంబైలో ఓ ఇంటిని నిర్మించుకున్నా. ఇల్లు కట్టుకోవడానికి చాలా కష్టమైంది. ఇంకా పెళ్లి అంటే ఎలా ఉంటుందో' అంటూ ఆ ఇంటర్వ్యూలో నవ్వేసింది పూజ. ఇక జీవితాంతం అతనితో కలిసి ఉంటే బాగుంటుంది అని అనిపించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పిన పూజా హెగ్డే.. చాలామంది ఇంట్లో ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకున్నారని కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని తెలిపింది. ఇక ప్రస్తుతానికి అయితే పెళ్లి ఆలోచన అయితే లేదని సినిమాలతో చాలా బిజీగా ఉన్నట్లు పూజ హెగ్డే చెప్పుకొచ్చింది.

దీంతో పెళ్లి గురించి పూజా హెగ్డే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ గా మారుతున్నాయి. ఇక హీరోయిన్ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ సరసన ఈమె నటించిన 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమాలోనూ రామ్ చరణ్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: