టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అందులో మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఇక మొదటిసారి ఈ సినిమాతో బాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేయబోతున్నాడు బన్నీ. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో పాటు హిందీలో ఏ ఏ సంస్థ ఈ సినిమా విడుదల చేస్తోంది. ఇక తాజాగా విడుదలైన పుష్ప ట్రైలర్ బాలీవుడ్లోనూ భారీ రెస్పాన్స్ ని అందుకుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా బాలీవుడ్ వెర్షన్ కోసం అల్లు అర్జున్ కి క్రేజీ హీరోయిన్ శ్రేయస్ తల్పడే డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బాలీవుడ్ వెర్షన్ కోసం రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకుండా మంచి పేరున్న హీరో తో డబ్బింగ్ చెప్పించడం ఈ సినిమాకి మరో ప్లస్ అనే చెప్పాలి. ఇక తాజాగా పుష్ప సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన సందర్భంగా ఈ విషయాన్ని శ్రేయస్ తల్పడే స్వయంగా వెల్లడించాడు. ఇండియా మొత్తం లోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గారికి డబ్బింగ్ చెప్పినందుకు చాలా గర్వంగా ఉందని చెప్పాడు శ్రేయస్. ఇక ఈ బాలీవుడ్ క్రేజీ హీరో ఒక తెలుగు స్టార్ హీరోకి డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి.
ఇక మరోవైపు ఇప్పటికే యూట్యూబ్ లో తన డబ్బింగ్ సినిమాతో బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఇక పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. మరి బాలీవుడ్లో బన్నీకి పుష్ప సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని అందిస్తుందో చూడాలి. ఇక గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనుండగా.. అతని సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు..!!