నందమూరి నట సింహం బాలకృష్ణ
హీరో గా
టాలీవుడ్ మాస్ దర్శకుడు
బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన
సినిమా అఖండ, ఈ
సినిమా లో
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, నటించగా
పూర్ణ మరో ముఖ్య పాత్రలో నటించింది, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ
సినిమా లో ప్రతినాయకుడి పాత్ర లో
శ్రీకాంత్ కనిపించాడు. ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు కలిగివున్న అఖండ
సినిమా డిసెంబర్ 2 వ తేదీన
థియేటర్ లలో విడుదలయ్యింది, ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ,
లెజెండ్ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో అఖండ
సినిమా విడుదలకు ముందు నుండే జనాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టు గానే అఖండ
సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది, అయితే ఈ
సినిమా ప్రజల నుండి మంచి స్పందన తెచ్చుకోవడంతో ఈ చిత్ర బృందం కూడా పలు
టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగంగా జగపతి బాబు తాజా గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ
సినిమా గురించి కొన్ని విషయాలు తెలియచేశాడు.. ఇప్పటికే జగపతి బాబు, బాలకృష్ణ,
బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన
లెజెండ్ సినిమాలో విలన్ గా కనిపించి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకున్నాడు. అయితే తాజా గా విడుదల అయిన అఖండ
సినిమా లో కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించ జగపతి బాబు అఖండ
సినిమా విశేషాలను తెలియజేస్తూ...
బోయపాటి శ్రీను అఖండ సినిమాలు నటించాలి అని అడిగాడు ఆ వెంటనే ఈ
సినిమా కథ గురించి అడగలేదు.. వినలేదు వెంటనే సినిమాకు ఓకే చెప్పేశాను అంటూ జగపతి బాబు తెలియజేశాడు.