ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

praveen
భారత సినీ ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రానేవచ్చింది. అయితే ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ పై అటు ప్రేక్షకులు అందరూ ఒక రేంజిలో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ ట్రైలర్ మాత్రం అంచనాలను అందుకోవడం కాదు అంతకు మించి అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఎవరు ఊహకందని విధంగా ట్రైలర్ అద్భుతంగా ఉంది అనే చెప్పాలి. ఇక సినీ ప్రేక్షకుల మతి పోగొడుతూ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది ఈ ట్రైలర్. ఇక ఈ ట్రైలర్లో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్.. కొమురం భీం గా జూనియర్ ఎన్టీఆర్ నటన అయితే పీక్స్ లెవల్లో ఉంది అనే చెప్పాలి.


 అయితే ఇక తమ అభిమాన హీరో కు సంబంధించిన అప్డేట్ విడుదలైంది అంటే ఫాన్స్ సృష్టించే హంగామా మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ విడుదల కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హంగామా సృష్టించారు. ట్రైలర్ రివ్యూ ను చూసేందుకు భారీగా తరలివచ్చారు అభిమానులు. ఈ సందర్భంగా జై జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం గమనార్హం. అదే సమయంలో విజయవాడ లోని అన్నపూర్ణ థియేటర్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి భారీ కటౌట్ కూడా ఏర్పాటు చేసారు అభిమానులు.



 ఇక ఈ భారీ కటౌట్ కి కొబ్బరికాయలు కొట్టడమే కాదు పాలాభిషేకం సైతం చేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ థియేటర్ లో ఏకంగా కేక్ కట్ చేసి అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే అభిమానుల తాకిడి తట్టుకోలేక సిబ్బంది థియేటర్ గేట్లు మూసివేయడం గమనార్హం. అయినప్పటికీ అభిమానులు గేటు దూకి మరి థియేటర్ లోపలికి వెళ్లారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పై కొంత మంది రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అవసరమైనప్పుడు తప్పక స్పందిస్తారు అంటూ అభిమానులు తెలిపారు. ఇక ట్రైలర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇరగదీశాడు అంటూఫాన్స్ అందరు మురిసిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: