లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఇదే ఇప్పుడు బాలీవుడ్ ట్రెండ్?
ఇటీవలి కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు అందరూ కూడా ఏకంగా తమ కంటే తక్కువ వయసున్న వారిని పెళ్లి చేసుకుంటున్నారు. మరికొంతమంది ఇక తక్కువ వయసున్న వారితో ఏకంగా ప్రేమాయణం సాగిస్తూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇలా బాలీవుడ్ హీరోయిన్లు మొత్తం తమకంటే పెద్దవారిని కాకుండా చిన్న వారితో రిలేషన్ షిప్ లో ఉండటం.. ఇక పెళ్లి కూడా సిద్ధమవుతూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలా ఇప్పటివరకు లేటు వయసులో ఘాటు ప్రేమ లో పడిన బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు అని చెప్పాలి.
మరికొన్ని రోజుల్లో కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలీవుడ్ లేటు ఘాటు ప్రేమ లు తెర మీదకు వస్తున్నాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా కత్రినా కైఫ్ తన కంటే ఐదేళ్ళు చిన్నవాడైన విక్కీ కౌశల్ తో పెళ్లికి సిద్ధమైంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ సుస్మితాసేన్ తనకంటే పదిహేనేళ్ల చిన్నవాడైన రోహమాన్ తో లవ్ లో పడింది. ఇక మలైకా అరోరా 48 ఏళ్ల వయసులో 36 ఏళ్ల అర్జున్కపూర్ తో ప్రేమలో మునిగితేలుతోంది. ఇక స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఐశ్వర్య రాయ్ తన కంటే రెండేళ్లు చిన్నవాడైన అభిషేక్ బచన్ ని పెళ్లి చేసుకుంది. బిపాసా బసు తన కంటే నాలుగేళ్లు చిన్నవాడైనా కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకోవడం గమనార్హం.