బంగార్రాజుతో కలసి నటించనున్న చిట్టి..!
చిట్టి బంగార్రాజు సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ లో చేయడానికి ఒప్పుకున్నది. మరొక పక్క కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఇక సమంత కూడా పుష్ప మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తోందంటే అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ముందుగా ఆ పాటకి శృతిహాసన్ , తమన్నా ని అనుకున్నారట కానీ వారు కొన్ని సినిమాలకి కమిట్మెంట్ కావడంతో.. ఈ సినిమాను వదులుకున్నట్లు సమాచారం. కానీ చిట్టి మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది.
ఫరీయా అబ్దుల్లా మొదటగా జాతి రత్నాలు వంటి చిన్న సినిమాతో ఇమే బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించింది. అయితే అలా కొడుకు తో కలిసి నటించిన ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం బంగార్రాజు మూవీ లో కూడా చాన్స్ కొట్టేసింది. ఇందులో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. ఇక బంగార్రాజు లోని కొన్ని స్పెషల్ సాంగ్ లో చేస్తున్నటువంటి ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.