అఖండ హిట్ అన్నారు..మరి అక్కడ అన్ని కోట్లు నష్టాలు తప్పవా..?

Divya
బాలయ్య బాబు కథానాయకుడిగా, బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం అఖండ. ఈ సినిమా మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ అంటూ తెలుపుతూనే ఉన్నారు. అయితే ఈ సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను రాబట్టినప్పటికీ.. ఒక వారం తరువాత మంచి కలెక్షన్లను రాబడుతోందని అనుకున్నారు. దీంతో బాలకృష్ణ బోయపాటి మళ్లీ హిట్ కొట్టారని తెలియజేయడం జరిగింది అభిమానులు, ప్రేక్షకులు. బాలయ్య అఘోర పాత్రకు బాగా సూటయ్యాడు అందుకే తన ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించింది అని సినీ ఇండస్ట్రీలో టాక్. అయితే ఇదంతా బాగున్నప్పటికీ కొన్నిచోట్ల అఖండ ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.


వాస్తవానికి ఓవర్సీస్ బిజినెస్ లో నైజాం, నెల్లూరు, సీడెడ్ వంటి ప్రాంతాలలో బ్రేక్ ఈవెంట్స్ పూర్తి చేసుకుంది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి గుంటూరు, ఈస్ట్, కృష్ణ, వెస్ట్ ప్రాంతాలలో అఖండ ఏమాత్రం కలెక్షన్లను రాబట్టి లేకపోయింది అన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ ఏరియాలన్నింటినీ కలుపుకొని.. బిజినెస్ 22.5 కోట్ల రూపాయలు జరిగిందట. కానీ ఇప్పటి వరకు ఈ ఏరియా లలో 16.45 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టినట్లుగా తెలిసింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సక్సెస్ సాధించాలంటే.. ఇంకా 6.5 కోట్ల రూపాయలను రాబట్ట వలసి ఉంటుంది. అప్పుడే ఈ సినిమా కొన్న బయ్యర్లు సేఫ్ లిస్టు లో ఉంటారు.

అయితే ఈ వీకెండ్ కచ్చితంగా మంచి కలెక్షన్లతో రాబడితే ఈ సినిమా నష్టాల బారినుండి తప్పించుకోగలదు.. అయితే తాజాగా విడుదలయ్యే సినిమాలలో లక్ష్య, గమనం వంటి సినిమాలు ఉన్నాయి, ఇక వీటితో పాటే పుష్ప సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమయింది. ఇక ఇన్ని సినిమాలు విడుదలయ్యాయి అంటే ఈ సినిమా అంతా కలెక్షన్లను రాబడుతోంది అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక సినిమాల్లో సక్సెస్ అయ్యాయి అంటే ఈ సినిమా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: