సినిమా టికెట్ రేటు వ్యవహారంపై శృతిహాసన్ కామెంట్స్..!
అయితే శృతి హాసన్ నేను ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను.. నేను ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ ని కాదు ఇలాంటి ప్రశ్నలు అడిగి ఏదో ఒక సమాధానం చెప్పమనడం సరైన పద్ధతి కాదు. కేవలం ఒక్క విషయమైతే చెప్పగలను.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అందరం కలిసికట్టుగా ఉండి, శక్తిమేరకు పనిచేస్తున్నామ్ . రాబోయే రోజుల్లో కొత్త వేరియంట్ కూడా వచ్చేలా కనిపిస్తోంది. మన పోరాటం మరింత పెంచాల్సి ఉంటుంది. సినిమా థియేటర్ ఓనర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ వంటి వారు వారికి తోచిన విధంగా.. చేతనైనంత పని చేస్తున్నారు. అని తెలియజేసింది.
ఇక ఈ క్లిష్ట పరిస్థితులలో ఎవరి స్వార్థం వారు చూసుకోకుండా ప్రతి ఒక్కరూ సినిమాలు చేసుకుంటూ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు సరైన సహాయం చేయాలి అని శృతి హాసన్ అందరికీ పిలుపునిచ్చింది. ఇక ఎప్పుడైతే కలిసికట్టుగా పని చేస్తామో..అప్పుడు సినీ ఇండస్ట్రీ ని ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని ఆమె స్పష్టం చేసింది. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ తన సినిమాల గురించి కూడా తెలియజేస్తూ.. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేయాలనుకుంటున్నానని తెలియజేసింది శృతిహాసన్. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఆమె మరో ఒరిజినల్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమా అన్ని భాషలలో విడుదలకానుంది. తానే స్వయంగా డబ్బింగ్ చెప్పబోతున్నట్లు సమాచారం.