హాట్ బ్యూటీ మెహరీన్, నాని హీరో గా తెరకెక్కిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటన కు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటం తో టాలీవుడ్ లో ఈ బ్యూటీ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇలా మొదటి సినిమా తోనే తెలుగు నాట మంచి క్రేజ్ ను సంపాదిం చుకున్న ఈ బ్యూటీ రాజా ది గ్రేట్, ఎఫ్ టు, పంతం వంటి పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ మధ్య కూడా ఈ హాట్ బ్యూటీ సంతోష్ శోభన్ హీరో గా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెహరీన్, వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇలా వరుస సినిమా ల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్న ఈ ముద్దు గుమ్మ మరో క్రేజీ సినిమా లో అవకాశాన్ని దక్కించుకుంది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే.. నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా కు ప్లాన్ జరుగుతున్న విషయం మన అందరికి తెలిసిందే అయితే, ఆ సినిమా లో మెహరీన్ కూడా తీసుకో వాలనే ఆలోచన లో దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నట్లు గా వార్తలు వస్తున్నాయి, మరి ఇప్పటి వరకు ఈ ఈ విషయం పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువ డలేదు.