మహానటి సావిత్రి అప్పుల పాలవడానికి ఆ సినిమానే కారణమా..?
ఇక మహానటి సావిత్రి బయోపిక్ మహానటి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటకి మర్చిపోలేని సినిమాగా నిలిచిపోయేలా తెరకెక్కించారు. సావిత్రి వ్యక్తిగత విషయాలు వేళ్తే.. ఆమె గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించిన సావిత్రి తెలుగు, తమిళ భాషల్లో ఎందరో స్టార్ హీరోలతో నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు.
సావిత్రి సినీ జీవితం పీక్ స్టేజ్‌లో ఉండగా ఆమె చేసిన ఒకే ఒక తప్పు అప్పటికే పెళ్లయ్యి పిల్లలు ఉన్న జెమినీ గణేషన్‌ను వివాహం చేసుకుంది. ఇక ఆ తప్పుకే ఆమె చాలా వరకు కుమిలిపోయి సగం మానసికంగా చనిపోయారు. సావిత్రికి అప్పట్లోనే కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించింది. ఇక ఎప్పుడైతే ఆమె జెమినీ గణేషన్‌ను సావిత్రి పెళ్లి చేసుకుందో అప్పటి నుంచే ఆమె కెరీర్ పతనం అవుతూ వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఆమె చివరకు మాదక ద్రవ్యాలకు బానిసై.. కెరీర్ చివరి రోజుల్లో చాలా దుర్భర స్థితిలో మృతి చెందారు.
అయితే సావిత్రి నర్తనశాల సినిమా కోసం ఏకంగా 12 గంటల పాటు పని చేశారని దర్శకులు చెబుతూ ఉండేవారు. అంతేకాక.. సావిత్రి దర్శత్వంలో చిన్నారి పాపలు అనే సినిమాని చిత్రీకరించారు. ఇక సావిత్రి ఆమె వాటాదారులను నమ్ముకుని నిర్మాణంలోకి అడుగు పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందులు రావడంతో పాటు వాటాదారులు ఎత్తివేయడంతో సావిత్రి సొంత ఆస్తులు అమ్ముకుని మరీ ఆ సినిమాను పూర్తి చేసిన అనుకుంతా ఫలితాలను రాబట్టలేకపోయింది.