పుష్ప సినిమాకు ఇది పెద్ద మైనస్ అయ్యేలా ఉందే ?
అఖండ ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు వరుస పెట్టి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ పెట్టి తీసిన పుష్ప సినిమా రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత ఇదే నెలలో నాని శ్యామ్ సింగరాయ - సంక్రాంతికి రాజమౌళి ఆర్ ఆర్ సినిమా - ప్రభాస్ రాధే శ్యామ్ - రానా - పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలు వరుసగా లైన్ లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే పుష్ప సినిమా ఫైనల్ కట్ రెండు గంటల 56 నిమిషాల వచ్చినట్టు తెలుస్తోంది. సుకుమార్ సినిమాలో గతంలో కూడా ఎప్పుడు రన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది. పుష్ప ఫస్ట్ పార్ట్ నాలుగు నిమిషాలు తక్కువ 3 గంటలు అంటే చాలా ఎక్కువే అని చెబుతున్నారు. కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందన్న లీకులు ఇప్పటికే బయటకు వచ్చాయి. కథలో ఎంత దమ్ము ఉన్న కూడా ఏకంగా నాలుగు నిమిషాల తక్కువగా మూడు గంటల పాటు థియేటర్ లో ఉండి సినిమా చూడటం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు.
మరి సుకుమార్ ఎంత క్రిస్పీగా ... ఎంత ఆసక్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు అన్న దానిని బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం సినిమా ల్యాగ్ ఎక్కువగా ఉంటే ఇది మైనస్ అవుతుందని అంటున్నారు.