అప్పుల్లో కూరుకుపోయిన అమితాబ్‌ను ఆదుకుంది వారేనా..?
బుల్లితెరపై అమితాబ్ బచ్చన్ 2000వ సంవత్సరంలో కౌన్ బనేగా కరోడ్ పతి షో నిర్వాహకులు తనను అప్రోచ్ అయ్యారని, ఇక ఆ సమయంలో తన దగ్గర డబ్బులు కూడా లేవు అని ఆయన తెలిపారు. ఇక అదే సమయంలో కౌన్ బనేగా కరోడ్పతి షో ఆఫర్ వచ్చిన సమయంలో డబ్బులు లేక ఏం చేయాలో తెలియక దీనస్థితిలో ఉన్నారని ఆయన స్టేజీపైనే కన్నీటి పర్యంతమయ్యారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు.. ఆఫర్ వచ్చిన సమయంలో తన చేతిలో డబ్బులు లేవని, అవకాశాలు కూడా లేవని ఎంతో ఇబ్బంది పడుతూ చాలా దీనస్థితిలో జీవితాన్ని గడుపుతున్నానని ఆయన వెల్లడించారు.
చిత్ర పరిశ్రమలో సినిమాలో నటించి అంత స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత కూడా అవకాశాలు లేక మళ్లీ బుల్లి తెరపై కనిపిస్తే ఎగతాళి చేస్తారేమో అన్న ఆలోచనతో భయపడి మొదటిసారి ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే అతను మనోధైర్యంతో షో చేయాలని నిర్ణయించుకుని, ఒక ఎపిసోడ్‌తో మొదలు పెట్టిన ఈ షో ఇప్పుడు వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయనకీ కౌన్ బనేగా కరోడ్పతి షో కాపాడిందని చెప్పుకొచ్చారు.