మెహ్రిన్ తో ఉన్న ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?
ఇకపోతే ఇక టాలీవుడ్ కి తిరిగి బౌన్స్ బ్యాక్ అయి ఎఫ్ 3 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఇప్పుడు సడన్ గా ఎవరో ఒక కొత్త కుర్రాడి తో ఇలా ప్రత్యక్షమవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. మెహ్రీన్ తో ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరూ అంటూ అందరూ గుసగుస లాడుతూ ఉండగా అందరి అనుమానాలను క్లియర్ చేసింది. ఇకపోతే అతడు మెహ్రీన్ కి మంచి స్నేహితుడు అట. ఇక అతడి బర్త్ డే వేడుకలు ఎంతో అందంగా సెలబ్రేట్ చేసింది. తనతో పాటు మరొక ఆరు మంది స్నేహితులను ఈవెంట్ కి పిలిచి అందరితో ఒకరికొకరు చాలా సన్నిహితంగా మెలిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే గుస్సీ బ్రాండ్ డిజైనర్ స్పోర్ట్స్ డ్రెస్ లో స్పెషల్ గా ఉన్న ఈ అబ్బాయి ఎవరో కానీ మెహరీన్ కి మాత్రం చాలా చక్కగా జోడి లాగా ఉన్నాడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. Archie's 30s అనే పేరుతో బర్తడే వేడుకల ఫోటోలను మెహ్రీన్ షేర్ చేసింది. సినిమాల విషయానికొస్తే ఇటీవల సంతోష్ శోభన్ సరసన మంచి రోజులు వచ్చాయి అనే సినిమా తో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు ఎఫ్ 3 సినిమాల్లో నటిస్తోంది.