ఆర్ఆర్ఆర్ : టికెట్ల ధ‌ర‌పై నిర్మాత డీవీవీ ఏమ‌న్నారంటే..?

N ANJANEYULU
దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానున్న‌ది. మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్ చరణ్, యంగ్‌టైగ‌ర్‌ తారక్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ పై  భారీగానే అంచెనాలున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు.. పోస్టర్స్ సైతం నెట్టింట్లో తెగ ట్రెండ్ గా మారుతున్నాయి.  ఇప్పుడు ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మేనియానే క‌నిపిస్తున్న‌ది. విడుదలైన గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్స్ వ్యూస్ సాధించింది ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్‌.

 ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా  జనవరి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిత్ర‌బృందం. ఈ త‌రుణంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసారు చిత్రయూనిట్.  శ‌నివారం ఉదయం నిర్వహించిన ఆర్ఆర్ఆర్ విలేకర్ల సమావేశంలో ప్రొడ్యూసర్ దానయ్య ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రెండు  తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం దాదాపుగా 1600 థియేటర్లు ఉన్నాయని.. ఏపీలో 1000 థియేటర్లు, తెలంగాణలో 600 థియేటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఆంధ‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ ధ‌ర‌ల‌ విషయంలోనే సమస్య ఎదుర్కొంటున్న‌ది చిత్రపరిశ్రమ.

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 రూపాయలు, మున్సిపాలిటీ పరిధిలో 60 రూపాయలు, పంచాయతీ పరిధిలో 20 రూపాయలు మించకుండా టికెట్ రేట్లు ప్రభుత్వం నిర్ణయించిన‌ది. ప్రభుత్వం నిర్ణయించిన ధ‌ర‌కే ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్లు అమ్మాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ది. ఆ టికెట్ రేటు విషయంలో కొంత వెసులుబాటు ఇస్తే  ఆన్‌లైన్‌ సిస్టమ్ కు ఓకే అంటోంది సినిమా పరిశ్రమ అని చెప్పారు. అయితే ఆ రేట్లతో థియేటర్లు నడపడం సాధ్యం కాదని, రేట్ల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేసారు. ఏపీలో సినిమా టికెట్‌ ధరల విషయంలో మీరు ఎన్టీఆర్‌ సాయం ఏమైనా తీసుకుంటారా? ఎందుకంటే ఎన్టీఆర్‌కు ఆప్తులైన ఇద్దరు వ్యక్తులు అక్కడ మంచి స్థాయిలో ఉన్నారు కదా? అని ప్రశ్నించగా.. ‘‘సినిమా టికెట్‌ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం అని.. త్వరలోనే ఓ కొలిక్కి వస్తోందని భావిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు డీవీవీ దాన‌య్య‌.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: