కూతురి కెరీర్ కోసం సినీ నటి పాట్లు ఫలించేనా?

VAMSI
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా మంది ఇండస్ట్రీకి వస్తారు. కానీ కొందరు మాత్రమే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి నటులలో సురేఖ వాణి ఒకరు. తెలుగు చిత్ర సీమలో ఎన్నో చిత్రాలలో వదినగా, అక్కగా, తల్లిగా ఇలా పాత్ర ఏదైనా అందులో అలవోకగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం సురేఖ వాణి కూతురు సుప్రిత ఇపుడు ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒక డెబ్యూ హీరో చిత్రంలో సురేఖ వాణి కుమార్తె సుప్రీత హీరోయిన్ గా చేయబోతున్నారు అని సమాచారం.

అందుకోసమే గత కొంత కాలంగా అమ్మా కూతుర్లు ఇద్దరూ కూడా ఏ చిన్న పార్టీకి వెళ్లినా లేదా ఇంటిలో ఏదైనా ఫంక్షన్ జరిగినా హాట్ హాట్ ఫొటోలతో కుర్ర కారును ఆకట్టుకుంటున్నారు. ఈ ఫోటోలపై విమర్శలు సైతం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శకులకు సురేఖ వాణి కూడా ధీటుగా జవాబిచ్చారు. అయితే అప్పుడే మీడియాలో సుప్రీతపై పలు వార్తలు వచ్చినా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తెలుస్తున్న సమాచారం నిజమేనని తెలుస్తోంది. బాగా తెలిసిన ఒక నిర్మాతను తన కుమార్తె కు ఛాన్స్ ఇవ్వమని అడగగా అలా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

మరి ఇంతకీ అది కరెక్టేనా ఏ సినిమా, దర్శకుడు హీరో పలు వివరాలు తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇక నటి సురేఖ ఆమె కుమార్తె సుప్రీత కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.  వీరిద్దరూ ఎపుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటారు. వీరు ఈ వేదిక పై  చేసే రచ్చ మామూలుగా ఉండదు, బర్త్డే లు, పార్టీలు, ఫన్నీ వీడియో లు చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెబుతూ సందడి చేస్తూ ఉంటారు సుప్రీత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: