హ్యాపీ సండే : ఈవారం టాలీవుడ్ బెస్ట్ మూమెంట్స్ ఇవే!

praveen
సాధారణంగా ప్రతి ఏడాది సంక్రాంతికి సినీ ప్రేక్షకులకు అసలు సిసలైన సినిమా మేనియా మొదలవుతు ఉంటుంది. కానీ గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ కారణంగా థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదల కాలేదు. ఇప్పుడు డిసెంబర్ నెలలో వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతోఈసారి సినీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి కంటే కాస్త ముందుగానే సినీ మేనియా మొదలైంది. ఈ నెల మొదలుకొని జనవరి చివరి వరకు కూడా వరుసగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


 దీంతో గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ ప్రేక్షకులు అందరికి తమ అభిమాన హీరోల సినిమాల నుంచి విడుదలవుతున్న అప్డేట్స్ అన్నీ కూడా ఒక బెస్ట్ మూమెంట్ గా మిగిలి పోతున్నాయి అని చెప్పాలి. మరి ఈ వారంలో టాలీవుడ్లో పరిశ్రమలో బెస్ట్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పుష్ప సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఇటీవలే ఆర్ఆర్ఆర్ అనే సినిమాకు సంబందించిన ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. ఇక ఇది తెలుగు ప్రేక్షకులకు ఒక బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. అదే సమయంలో ఇక సమంత నటించిన పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ సంబంధించిన లిరికల్ వీడియో విడుదల కావడం కూడా ప్రేక్షకులకు బెస్ట్ మూమెంట్అనే చెప్పాలి.



 అయితే ఇటీవలే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కేవలం తక్కువ సమయంలో ఏకంగా ఎక్కువ లైక్స్ సొంతం చేసుకున్న ఏకైక టాలీవుడ్ సినిమాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అటు సమంత ఐటమ్ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తు దూసుకుపోతుంది. అంతేకాదు ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలైన తర్వాత చిత్రబృందం మొత్తం కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం.. ప్రెస్మీట్లో సరదా సంఘటనలు జరగడం.. షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన అల్లరి గురించి రాజమౌళి చెప్పడం టాలీవుడ్ ప్రేక్షకులకు బెస్ట్ మూమెంట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: