అప్పుడు అనుష్క.. ఇప్పుడు సమంత.. భలే చిక్కారు!!
టాప్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క దాదాపు టాలీవుడ్ లో కనుమరుగైపోయింది అనే చెప్పాలి. మెల్ల మెల్లగా సినిమాలకు కూడా దూరం అయిపోతుంది. ఇటు సమంత కూడా ఇప్పుడు పెద్ద గా సినిమా అవకాశాలు అందుకోవడం లేదు. విడాకుల తర్వాత సినిమా అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది ఈమె. ఆ విధంగా ఇప్పుడు ఆమె చేతిలో రెండు భారీ సినిమాలు తెలుగు లో రాబోతున్నాయి. వాటిలో ఒక సినిమాకు సంబంధించిన షూటింగ్ తేదీ ఇప్పటికే పూర్తి కాగా త్వరలో విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇక రెండవ సినిమా యశోద త్వరలోనే షూటింగ్ కు వెళ్లబోతుంది. ఈ చిత్రంపై సమంత భారీ హోప్స్ పెట్టుకుంది.
అయితే ఈ సినిమాలో కథానాయకుడిగా మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో అనుష్క తో కలిసి ఈ హీరో భాగమతి అనే సినిమాలో చేయగా ఇప్పుడు సమంత సరసన ఓ సినిమాలో చేయడం విశేషం. ఆ విధంగా ఇద్దరు టాప్ హీరోయిన్లతో నటించిన మలయాళ నటుడు గా ఈ హీరో చరిత్ర సృష్టించబోతున్నారు. తెలుగులో జనతా గ్యారేజ్ అనే సినిమాలో విలన్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. మరి ఈ సినిమా సమంత కు ఎంత ముఖ్యమో ముకుందన్ కూడా తెలుగులో నిలదొక్కుకోవడానికి కూడా అంతే ముఖ్యం. మరి దీనికి ఏ రేంజ్ లో పాపులారిటీ అందుకుంటాడో చూడాలి.