రష్మిక పై బన్నీ షాకింగ్ కామెంట్స్.. అలా పిలుస్తానంటూ..!!

Divya
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా పుష్ప. ఇప్పటికే ఆర్య , ఆర్య-2 సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈ కాంబినేషన్ మూడోసారి ముచ్చటగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పలకరించడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే డిసెంబర్ 17 వ తేదీన దేశవ్యాప్తంగా పుష్ప సినిమా విడుదల కాబోతోంది కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు నిన్న రాత్రి హైదరాబాదులో చాలా ఘనంగా జరిపారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే . ఇకపోతే ఆయన స్టేజ్ మీదకు వచ్చి కూడా అభిమానులతో చిత్తూరు యాసలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ  ..ఏందబ్బా ఎట్టా ఉండారూ .. సానా దినాలైంది మిమ్మల్ని నేను ఇట్టా గలిసి .. బావుండారా .. ఏందప్ప ఏందీ రచ్చ .. తగ్గేదే లే'. అని మాట్లాడి..అందరికీ ఫ్యాన్స్ ఉంటే నాకి తోడుగా  ఆర్మీ ఉంది. నా లైఫ్ లో  నాకంటూ నేను ఏదైనా సంపాదించుకున్నానంటే అది మీరే అంటూ మాట్లాడారు అల్లు అర్జున్. ఇక దేవిశ్రీ ప్రసాద్ కూడా ప్రతి పాటలు చాలా అద్భుతంగా తెరకెక్కించారు  నాలుగు సినిమాలకు పడ్డ కష్టం కేవలం ఒకే సినిమాలో పడ్డాము. అందుకే ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని తెలియజేశారు.

ఇక రష్మిక గురించి మాట్లాడుతూ.. రష్మికాను నేను ముద్దుగా క్రష్మిక అని పిలుస్తూ ఉంటాను. సాధారణంగా మనం ఎవరితోనైనా కలిసి పని చేసేటప్పుడు కొంతమంది మనసుకు  నచ్చుతారు. అలాంటి వారిలో నా మనసుకు బాగా నచ్చిన అమ్మాయి రష్మిక. తను చాలా ఇంటెలిజెంట్.. చాలా సింపుల్ గా ఉంటుంది.. ఎంతో అందంగా ఉంటుంది.. వెరీ స్వీట్ , వెరీ టాలెంటెడ్ అంటూ రష్మిక పై ప్రశంసల వర్షం కురిపించాడు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: