బిగ్ బాస్ షోలో నాగార్జున సంచలన నిర్ణయం..!!

N.ANJI
బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ షో ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ షో సీజన్1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. అయితే తన హోస్టింగ్‌తో ప్రేక్షకుల్లో ఈ షోపై ఎన్టీఆర్ క్రేజ్‌ను పెంచడంతో పాటు స్టార్ మా ఛానెల్‌ను నంబర్ 1 స్థానంలో నిలిపారు. ఆ తరువాత సీజన్ 2కి హోస్ట్ చేసే ఛాన్స్ దక్కినా ఎన్టీఆర్ మాత్రం ఆ షోను హోస్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో సీజన్2కు నాని హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వడం నాని కూడా ఆ సీజన్‌కు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే.
ఇక ఆ తరువాత బిగ్ బాస్ సీజన్3 నుంచి అక్కినేని నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. నాగార్జున తన హోస్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేస్తున్నారు. ఇక ఇటీవల నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందేంటంటే.. నాగార్జున వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకోనున్నారు. ఆదివారం జరిగిన షోకు గెస్ట్‌గా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. అయితే కోట్ల సంఖ్యలో మొక్కలను నాటించాలని సంతోష్ కుమార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
అంతేకాదు.. రేపటి ప్రగతికి పచ్చదనమే పథమని ఆయన వెల్లడించారు. ఇక  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి సంతోష్ కుమార్ మాట్లాడిన మాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలై మూడు సంవత్సరాలు పూర్తైందని చెబుతూ బిగ్ బాస్ హౌస్‌లో నాటాలని ఒక మొక్కను నాగార్జునకు అందజేశారు. ఇక గడిచిన మూడు సంవత్సరాలలో 16 కోట్ల మొక్కలను నాటానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటివరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రభాస్ 1650 ఎకరాలను దత్తత తీసుకున్నారని సంతోష్ కుమార్ వెల్లడించారు. అయితే నాగార్జున తాను కూడా అడవులను దత్తత తీసుకుంటానని తెలిపారు. అంతేకాదు.. సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ 1,000 ఎకరాలను దత్తత తీసుకుంటానని నాగార్జున చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: