బాలీవుడ్ న్యూ కపుల్
విక్కీ కౌశల్ ఇంకా
కత్రినా కైఫ్ వివాహం ప్రస్తుతం ట్రెండీ టాపిక్ అయ్యింది.ఈ నూతన వధూవరులు ఇప్పుడు ఆకాశంలో తేల్తున్నారు. ప్రస్తుతం రిసెప్షన్ ఏర్పాటులో వారు చాలా బిజీగా ఉన్నారు. మరోవైపు ఈ కొత్త జంట అందుకున్న ఖరీదైన కానుకల గురించి సోషల్ మీడియాలో మంచి ఆసక్తికర చర్చ సాగుతోంది. అదికూడా ఆసక్తికరంగా తన మాజీ ప్రియులిద్దరూ తన హబ్బీ కంటే ఖరీదైన కానుకలిచ్చి కత్రీనాని ఆశ్చర్యపరిచారు.వరుడు
విక్కీ కౌశల్ ..తన హాట్
వైఫ్ కి రూ.1.3కోట్ల విలువైన డైమండ్ రింగ్ ను బహుమతిగా ఇచ్చాడు.ఇక కత్రిన కైఫ్ మాజీ ప్రియుడు అయినా
రణబీర్ కపూర్ ఆమెకు రూ.2.7కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ను బహుమతిగా ఇవ్వడం జరిగింది.అలాగే రూ. 3కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్
కార్ ని కూడా కానుకగా ఇచ్చి ఈ జంటను
కత్రినా కైఫ్ మాజీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్
సల్మాన్ ఖాన్ ఆశ్చర్యపరిచారు.
ఇక
కత్రినా కైఫ్ తన భర్తకు ముంబైలోని రూ. 15కోట్ల విలువైన అపార్ట్ మెంట్ ను బహుమతిగా ఇచ్చింది.ఇక వీళ్ళు మాత్రమే కాదండోయ్ ఈ నవ దంపతులకు లక్ష రూపాయల విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్ ను
ఆలియా భట్ బహుమతిగా ఇవ్వడం జరిగింది. కత్రినాకు రూ.6.4లక్షల విలువైన డైమండ్ చెవిపోగులను
అనుష్క శర్మ గిఫ్ట్ గా ఇచ్చింది.అలాగే
బాలీవుడ్ కింగ్ ఖాన్
షారుఖ్ ఖాన్ కూడా వారి వివాహ వేడుకలో ఈ జంటకు ఒక ఖరీదైన పెయింటింగ్ ను బహుమతిగా ఇవ్వడం జరిగిందట. దాని విలువ వచ్చేసి రూ. 1.5 లక్షలు. అలాగే
బాలీవుడ్ గ్రీక్
గాడ్ హృతిక్
రోషన్ విక్కీకి రూ. బిఎమ్డబ్ల్యూ జి310 ఆర్
బైక్ ని బహుమతిగా ఇచ్చాడు. ఈ
బైక్ విలువ వచ్చేసి 3 లక్షలు సుమారుగా ఉంటుంది. అలాగే తాప్సీ విక్కీకి రూ.1.4లక్షల విలువైన ప్లాటినం బ్రాస్
లెట్ ను బహుమతిగా ఇచ్చిందట. ఇలా
బాలీవుడ్ ప్రముఖులు వీరి వివాహానికి ఖరీదైన బహుమతులు ఇచ్చి తమ అభిమానాన్ని చూపించారు.