ఆర్ ఆర్ ఆర్ తో బాలీవుడ్ కు న్యూ కల్చర్ !

Seetha Sailaja
బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ లకు బాలీవుడ్ లో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ వారి అభిమాన హీరోలు కనిపించగానే ఈలలు చప్పట్లు కొడతారు కానీ ‘జైజై’ నినాదాలు చేయరు. అయితే మన దక్షిణాది ప్రేక్షకులు మాత్రం తమ అభిమాన హీరోలను దేవుళ్ళుగా భావిస్తారు కాబట్టి వారిని ఆరాధిస్తూ జైజై నినాదాలు చేస్తారు.



ఇప్పుడు ఈకల్చర్ బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ద్వారా పరిచయం కాబోతోంది. త్వరలో రిలీజ్ కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆమూవీ ముంబాయ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు తెలుగురాష్ట్రాల నుండి ప్రత్యేకంగా చరణ్ జూనియర్ అభిమానులను సుమారు 1000 మందిని ఈ ఈవెంట్ కు తీసుకు వెళ్ళడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.


చరణ్ జూనియర్ లకు ముంబాయ్ లో చెప్పుకోతగ్గ ఫాలోయింగ్ లేదు. ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగురాష్ట్రాల నుండి చరణ్ జూనియర్ లకు సంబంధించిన వీరాభిమానులను ఎంపిక చేసి ఆఫంక్షన్ కు తీసుకు వెళ్ళి అక్కడ జై జూనియర్ జై రామ్ చరణ్ నినాదాలతో ఆ ఈవెంట్ ను హోరెత్తించబోతున్నారు. ఇప్పుడు ఇలాంటి కల్చర్ బాలీవుడ్ కు పరిచయం కాబోతు ఉండటంతో ఇక నుంచి టాప్ బాలీవుడ్ హీరోలు కూడ ఇలాంటి స్లొగన్స్ కు అలవాటు పడే అవకాశం ఉంది.  



ఈసినిమాకు సంబంధించి బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ ఎలాగు నటిస్తోంది కాబట్టి బాలీవుడ్ యూత్ లో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుందని జక్కన్న వ్యూహం. ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలి అంటే ఈమూవీకి ఉత్తరాది రాష్ట్రాలలో విపరీతమైన కలక్షన్స్ వచ్చి తీరాలి. అయితే కరోనా పరిస్థితుల నేపధ్యంలో దక్షిణాదిన సినిమా ధియేటర్స్ కు వస్తున్న రీతిలో ఉత్తరాదిన ఇప్పటికీ ప్రేక్షకులు ధియేటర్లకు రాకపోవడంతో ఎంతవరకు రాజమౌళి ఆశలు నెరవేరుతాయి అన్నది సమాధానం లేని ప్రశ్న..





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: