షాకింగ్: సమంతపై చైతూ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్..!!
అయితే ముఖ్యంగా సమంత బోల్డ్ రోల్స్ చేయడం చైతుకి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌కి నచ్చలేదని కొన్ని వార్తలు వచ్చాయి. కాగా.. ఈ విషయంలోనే గొడవలు జరగడం వల్లే సామ్ - చైతులు విడిపోయారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. ఈ ప్రచారానికి చైతు చేసిన తాజా వ్యాఖ్యలు మరింత బలం చేకుర్చునట్లు ఈ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల చైతు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అక్కడ యాంకర్`మీరు ఎలాంటి పాత్రలను చేయడానికి ఆసక్తి చూపరు? అని యాంకర్ అడిగారు.
ఆ ప్రశ్నపై చైతు స్పందిస్తూ.. `నేను అన్నీ తరహా పాత్రలను చేయడానికి ఎప్పుడూ సిద్ధమే అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. నేను చేసే సినిమా కానీ, పాత్ర కానీ నా కుటుంబంపై ఎఫెక్ట్ చూపించకూడదని అన్నారు. అంతేకాక నా కుటుంబంపై ప్రభావం చూపే విధంగా ఉంటే మాత్రం చేయను అని వెల్లడించారు. అయితే నెటిజన్లు చైతు సామ్ గురించే మాట్లాడాడని, ఆమెపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేశాడని కామెంట్లు పెడుతున్నారు.
ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘లవ్ స్టోరీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈయన ప్రస్తుతం ‘థ్యాంక్యూ’ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అంతేకాదు.. తండ్రి నాగార్జునతో కలిసి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమాలోనూ నటిస్తున్నారు. ఇవేకాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈయన చేతుల్లో ఉన్నట్లు సమాచారం.