వేణు ఉడుగుల డైరెక్షన్ లో సురేష్ బాబు నిర్మిస్తున్న తాజా సినిమా విరాటపర్వం. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా రానా హీరో గా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా చిత్ర బృందం నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లో నుండి వాయిస్ ఆఫ్ రవన్న వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఈ వీడియోను ఈ రోజు రానా పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఆ సీన్ లో ఆయుధమై కదిలిన ఆకాశం అతడు... అరణ్య అలియాస్ 'రవన్న అంటూ విడుదలైన ఈ సీన్ లో ఆలీవ్ గ్రీన్ దుస్తుల్ని దరించి కనిపించిన సీన్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ సీన్ ఇప్పుడు రానా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం అనే ఈ సినిమా మాత్రం ఇప్పట్లో రిలీజ్ అయ్యే సూచనలు కనబడడం లేదు. రానా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సీన్ లో కూడా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సంక్రాంతికి విడుదల చేస్తారు అని చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి కూడా మూడు సంవత్సరాలు దాటిపోయింది. ఈ సినిమా కోసం అభిమానులు మాత్రం సంవత్సరంన్నర పాటుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కావడంతో ముందు ముందు పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో..
ఈ సినిమాను విడుదల చేయలేక పోతున్నారు మెకర్స్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని థియేటర్లలో కాకుండా ఓటిటి లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా అమెజాన్ లో రిలీజ్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ 2019లో స్టార్ట్ అయింది. కానీ దాని తర్వాత రానా అందుబాటులో లేకపోవడం తర్వాత కరుణ రావడం వల్ల ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది.సురేష్ బొబ్బిలి విరాటపర్వానికి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో నాని సాయి పల్లవి తో పాటు ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్ నవీన్ చంద్ర, ఈశ్వరీ రావ్ వంటి వారు కొన్ని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.