మెగా పవర్ స్టార్రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం RRR.బాహుబలి సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఇది.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది.అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులు కూడా ప్రారంభించారు చిత్ర యూనిట్.ఈ ప్రమోషన్స్ పనులు హైదరాబాద్ లొనే కాకుండా ముంబైలోనూ జరుగుతున్నాయి.
రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వీరి సరసన హీరోయిన్ గా శ్రియా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తను మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదట.వెండితెరపై ఎంతో అందంగా కనిపించే శ్రేయ ఓ రష్యన్ ను వివాహం చేసుకుంది.ఇటీవల ఓ పాపకు కూడా జన్మనిచ్చింది తను.తెలుగులో చాలా మంది టాప్ హీరోల తో ఆమె మంచి మంచి సినిమాలను చేసిన విషయం తెలిసిందే. వీటన్నిటి తర్వాత సినిమాలకు కాస్త దూరం గా ఉంది ఈ భామ. అయితే తాజాగా శ్రేయాకు మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న rrr సినిమాలు ఈ భామ నటిస్తూన్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లో కూడా తాను బాగా కనిపించింది. ప్రమోషన్స్ విషయం లో మాత్రం ఈ భామను పక్కకు పెడుతున్నారట.దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు శ్రేయ.అయితే రాజమౌళి అందరిని పిలిచి తనను మాత్రమే పిలవడం లేదని తాను బడదపడుతుంది.శ్రేయ ఈ సినిమాతో పాటుగా గమనంప్రమోషన్స్ అనే సినిమా కూడా చేస్తుంది.అయితే శ్రేయ పలు ఇంటర్వ్యూ లకు వేల్లి సినిమా గురించి చాల పాజిటివ్ గా మాట్లాడింది.రాజమౌళి గారూ ప్రోమోషన్స్ కి పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్తానని తాను చెప్పుకొచ్చింది.అయితే ఈ సినిమాలో తన పాత్ర అంత కీలకంగా ఉండకపోవడమే దీనికి కారణం అని టాక్ వినిపిస్తుంది.