మహేష్ - బాలయ్య అన్స్టాపుబల్ షోపై ఇంట్రస్టింగ్ న్యూస్..!
ధైర్యంగా అఖండ రిలీజ్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ధైర్యం ఇచ్చాడు. అఖండ హిట్ తో ఉన్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు అల్లు వారి ఆహా ఓటీటీ కోసం అన్స్టాప బుల్ ఎన్.బి.కె టాక్ షో కూడా చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా ప్రారంభమైన ఈ షో తెలుగు బుల్లితెర పై ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు స్ట్రీమింగ్ అయిన అన్ని ఎపిసోడ్ లు ప్రేక్షకులను మెప్పించాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్య నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ కు కు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని చెపుతున్నారు. ఇది వచ్చే వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్. ఇక బాలయ్య - మహేష్ మధ్య అదిరిపోయే సంభాషణతో ఈ ఎపిసోడ్ దద్దరిల్లి పోనుందని తెలుస్తోంది.
అయితే ఫస్ట్ సీజన్ కు చిరు , ఎన్టీఆర్ , రానా , అల్లు అర్జున్ , విజయ్ దేవర కొండ లాంటి వాళ్లు గెస్టులుగా వస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇవేవి లేవని తెలుస్తోంది. ఈ ఫస్ట్ సీజన్ ను మహేష్ ఎపిసోడ్ తోనే క్లోజ్ చేయాలని భావిస్తున్నారట. ఆ తర్వాత రెండో సీజన్ మరింత గ్రాండ్ గా ఏర్పాటు చేస్తారని అంటున్నారు.