బుల్లితెరపై బాగా ప్రదర్శించబడుతున్న
రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్5 గ్రాండ్ ఫినాలే
ఎపిసోడ్ ఈ నెల 18వ తేదీన ప్రసారం కానుంది.
బాలీవుడ్ నటీనటులు ఈ షోకు గెస్టులుగా హాజరు కానున్నారని జోరుగా ప్రచారం అనేది జరుగుతోంది.బిగ్ బాస్ సీజన్ 3 ఇంకా సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు
మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరు కాగా సీజన్ 5 గెస్టుల విషయంలో మాత్రం కొన్ని మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. అయితే
బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని
నాగార్జున కొంతమంది కంటెస్టెంట్ల విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని నెటిజన్ల నుంచి రకరకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి.తాజాగా
హీరోయిన్ మాధవీలత తన ఫేస్ బుక్ ద్వారా హోస్ట్ నాగార్జునపై తీవ్రస్థాయిలో ఫైర్ అవ్వడం జరిగింది.నాగార్జున హోస్టా లేక ఘోస్టా అంటూ
మాధవీలత షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో
నాగార్జున పై విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
నాగార్జున కొంతమందిని సపోర్ట్ చేస్తూ మరి కొందరిని టార్గెట్ చేస్తున్నారని నెటిజన్లు సైతం సోషల్
మీడియా వేదికగా తెగ ఆరోపిస్తున్నారు.
సిరి షణ్ముఖ్ విషయంలో
నాగార్జున ప్రవర్తన అసలు సరిగ్గా లేదని విమర్శలు కూడా బాగా వ్యక్తమవుతున్నాయి.సిరి షణ్ముఖ్ చేస్తున్న తప్పుడు పనుల్ని హోస్ట్
నాగార్జున బాగా ఎంకరేజ్ చేస్తున్నారని
మాధవీలత అన్నారు. హోస్టింగ్ చేయకుండగా
నాగార్జున అవమానకరంగా మాట్లాడుతున్నారని
మాధవీలత చెప్పడం జరిగింది. తప్పుల్ని కౌంటర్ చేయలేని నాగార్జునకు కౌంటర్ వేసే హక్కు లేదని ఆమె నాగార్జునపై కామెంట్లు చేసింది. సమాజానికి
నాగార్జున దీని ద్వారా ఏం నేర్పిస్తున్నారని గత వారం
కాజల్ ను వెటకారం చేయడం ఏమిటని
మాధవీలత కామెంట్లు చేయడం అనేది జరిగింది. ఇక హోస్ట్ అంటే ఏ విధంగా ఉండాలో
జూనియర్ ఎన్టీఆర్ ను చూసి నేర్చుకోవాలని అనాలని ఉందని ఆమె చెప్పడం జరిగింది.ప్రస్తుతం ఈమె నాగార్జునపై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. కొంతమంది అయితే నోరుందికదా అని ఎలా పడితే అలా వాగొద్దు అంటూ మాధవీలతపై మండిపడుతూ వున్నారు.