ఇంద్ర సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..??
అయితే ఈ ఈ సినిమా మా స్టోరీ మొత్తాన్ని రచయిత చిన్ని కృష్ణ. దర్శకుడు గోపాల్ కు కాశీలోనే నెరేట్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో చిరంజీవి మేనల్లుడుని కొడుతున్నప్పుడు సౌకత్ అలీ ఖాన్ పాత్రతో చిరు చెప్పే డైలాగ్ చిరంజీవి స్వయంగా పట్టుబట్టి రాయించుకున్నారంట.. ‘సౌకత్ ఆలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి.. తల దించుకుని వెళ్తున్నాను.. లేకపోతే తలలు తీసుకెళ్లే వాడిని..’ అన్న డైలాగు ఎంత పాపులర్ అయ్యిందో చెప్పనక్కర్లేదు.
అంతేకాదు.. ఈ చిత్రంలో సెకండాఫ్‌లో చిరంజీవి సింహాసనాన్ని అధిష్టించి ముఖేష్ రుషీతో ‘రాననుకున్నావా.. రాలేనని అనుకున్నావా’ అని చెప్పే డైలాగు చిరు ఫ్యాన్స్‌కు మాంచి జోష్ తీసుకొచ్చింది. అయితే ఈ డైలాగ్‌ను రాత్రి 12 గంటలకు శబ్దాలయ థియేటర్లో ఎడిటింగ్‌లో చూసిన నిర్మాత అశ్వినీదత్ అర్ధరాత్రి అయినా అప్పటికప్పుడు చిరంజీవికి ఫోన్ చేసి నిద్ర లేపి మరీ అభినందించారని చిరంజీవి చెప్పుకొచ్చారు.
అయితే అప్పటకి చిరు నిద్ర పోతుండగా.. ఫోన్ తీసిన చిరు భార్య సురేఖ దత్ ఈ టైంలో ఫోన్ ఎందుకు చేశారని అడగగా.. అశ్వినీదత్ నిద్ర లేపమని అన్నారంట. ఇక చిరంజీవి సినిమా సూపర్‌గా ఉంది అదిరిపోయింది అని మెచ్చుకున్నారని తెలిపారు. ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.17 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిగా.. ఇంద్ర సినిమా రిలీజ్ అయ్యాక రూ.32 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.