ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా 'పుష్ప'. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.ఇక సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ పజిల్, సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఈ సినిమా. ఇక విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే అల్లు అర్జున్ వరుస ప్రెస్ మీట్స్ ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో పుష్ప చిత్ర యూనిట్ కి కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. పుష్ప సినిమా విడుదలకి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇంకా యూఎస్ ప్రీమియర్ కి సంబంధించి ఫస్ట్ కాపీ రెడీ కాలేదట.
ఈ నేపథ్యంలోనే పుష్ప చిత్ర యూనిట్ ఇప్పుడు టెన్షన్ పడుతోందని.. అంతేకాకుండా ఈ విషయంపై బన్నీ సైతం దర్శకుడు సుకుమార్ పై ఫైర్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం కల్లా ఫస్ట్ కాపీ పూర్తయి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో సుకుమార్ సినిమాకి ఇలాంటి టెన్షన్స్ ఏర్పడడం కొత్తేం కాదు. గతంలో కూడా ఎన్నో సార్లు తను కంగారు పడి అభిమానులను కంగారు పెట్టాడు సుకుమార్. సౌత్ ఇండియా మొత్తంలోనే భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి...!!