వావ్.. మంచి మనసు చాటుకున్న ఆ స్టార్ హీరోలు..!
వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటించడంతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ ప్రభాస్ కెరీర్ ను కొనసాగిస్తున్నారట.. దేశవ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులు ఉన్నారని తెలుస్తుంది.. సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిత్వం విషయంలో కూడా ప్రభాస్ అందనంత ఎత్తులో ఉన్నారని తెలుస్తుంది.తాజాగా ప్రభాస్ చేసిన పని ఆదిపురుష్ టీమ్ ను ఫిదా చేసిందట.ప్రభాస్ రాముడిగా కృతిసనన్ సీతగా ఈ సినిమాలో నటిస్తుండగా సినిమాలో ప్రభాస్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైందని సమాచారం.
ఈ సందర్భంగా ప్రభాస్ ఖరీదైన రాడో రిస్ట్ వాచెస్ ను చిత్ర బృందానికి బహుమతిగా ఇచ్చారని తెలుస్తుంది.ఆదిపురుష్ టెక్నికల్ టీమ్ కు చెందిన ఒక సభ్యుడు ఈ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయని తెలుస్తుంది.. ప్రభాస్ ఈ విధంగా బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదట.గతంలో ప్రభాస్ తన దగ్గర పని చేసే జిమ్ ట్రైనర్ కు 73 లక్షల రూపాయల ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చారని సమాచారం..
కొన్ని రోజుల క్రితం బన్నీ పుష్ప సినిమాకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు గోల్డ్ రింగ్స్ ఇచ్చారని అందరికి తెలిసిందే.. స్టార్ హీరోలు వరుసగా తమ సినిమాలకు పని చేసిన వాళ్లకు బహుమతులు ఇస్తూ మంచి మనస్సును చాటుకుంటున్నారట.. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా జనవరి నెల 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందట.ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించారని అందరికి తెలిసిందే.