న్యాచురల్ స్టార్
నాని శ్యామ్‌సింగరాయ్
సినిమా లో నటిస్తున్నాడు.. ఈ
సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుంది. ఈ నెల 24 న విడుదల చేసెందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం వరంగల్ లో రాయల్ గ్రాండ్
ఈవెంట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే.. మహారథ అతిరథుల నడుమ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ
ఈవెంట్ కు
హీరో నాని,హీరోయిన్స్
సాయి పల్లవి, కృతిశెట్టిలతో ఇతర నటీనటులు హాజరయ్యారు. ఎప్పటిలాగే
నాని మైక్ పట్టుకుంటే పంచ్ డైలాగులు వెయ్యడం స్టార్ట్ చేసాడు.. జనాలను ఎలా ఆకర్షింఛాలో నానికి బాగా తెలుసు. ఈ సందర్భంగా తనకూ కళ్లు తాగే అలవాటు ఉందని సీక్రెట్ ను బయట పెట్టాడు.. ఆ తర్వాత
ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరించిన సుమపై మాటల వర్షం కురిపించాడు.
ఎవరైనా
సినిమా లో నటించిన
హీరో , హీరోయిన్ల కోసం
ఈవెంట్ ను వాయిదా వేస్తారు. కానీ తెలుగు ఇండస్ట్రీ లో మాత్రం యాంకర్
సుమ డేట్స్ కోసం ఎదురు చూస్తారు. పరిశ్రమలో డైరెక్టర్లు, నిర్మాతలు హీరోల కాల్‌షిట్ కోసం ఎదురు చూస్తారు. కానీ హీరోలు మాత్రం
సుమ కోసం ఆగుతారు. ఇది నిజం.. ఆమె తో చేసిన
ఈవెంట్ మంచి
సక్సెస్ అవుతుందని అందరి నమ్మకం. ప్రీరిలీజ్ నుంచి సక్సెస్ మీట్స్ వరకు ఏ
మూవీ ఈవెంట్ అయిన
సుమ డేట్స్ చూసుకుని ప్లాన్ చేస్తాం అంటూ సుమపై పొగడ్తలు కురిపించాడు.
సుమ నవ్వుతూ నానికి దండం పెడుతూ థ్యాంక్స్
చేప్పింది. ఇకపోతే
సాయి పల్లవి డ్యాన్స్.. ఆమె అలా చేస్తుంటే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది అంటూ మరోసారి ఆకాశానికి ఎత్తేశాడు.. మొత్తానికి
నాని మాట్లాడిన ఈ మాటలు హైలెట్ గా నిలిచాయి.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు ఒకసారి ఆ వీడియో పై లుక్ వేసుకోండి..