టికెట్ రేట్స్.. అవకాశం వచ్చిందని బాదరుగా..

Purushottham Vinay
ఇక మన తెలుగు ప్రజలకు సినిమాకు మించిన మంచి వినోద సాధనం లేదు అంటుంటారు. అయితే కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఓటీటీలు ఇంకా టీవీలు సినిమాను కేవలం ఓ ఆప్షన్‌గా మార్చేశాయి.ఇక అంతకుముందు కాలంలో సినిమానే ప్రధాన వినోద సాధనంగా ఉన్నప్పుడు…సినిమాలు చూసే ప్రేక్షకులకు ఉన్నవి రెండే రెండు సమస్యలు. అందులో ఒకటి మంచి సినిమా రావడం, రెండోది పెద్ద సినిమా వస్తే టికెట్ల రేట్లు అమాంతం బాదడం. ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం మనమంతా ఇలాంటి బాధలు చూసేవాళ్లం.ఇందులో మొదటి సమస్య అయితే దేవుడి చేతులో తప్ప ఎవరి చేతుల్లోనూ లేదు. కానీ రెండో సమస్య మాత్రం సినిమా వాళ్ల చేతుల్లోనే పక్కాగా ఉంది. సినిమా వాళ్లు తలచుకుంటే ప్రేక్షకులకు ఈ టికెట్ రేట్ల బాధ లేకుండా కూడా చేయొచ్చు.ఇక ఇదంతా కూడా తెలుగు ప్రజల గురించే.. అందులోనూ ముఖ్యంగా ఏపీ ప్రజల గురించి చెప్పిన సంగతి.


ఇక మొన్నటి వరకు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన 'టికెట్‌ ధరల' జీవో కారణంగా తక్కువ రేటుకే సినిమా చూడటం అలవాటు చేసుకున్నారు జనాలు. అయితే దాని వల్ల థియేటర్లు, ఎగ్జిబిటర్లు ఇంకా అలాగే డిస్ట్రిబ్యూటర్లు… ఇలా మొత్తంగా నిర్మాతకు నష్టం వచ్చేది. అయితే ఇక ఇప్పుడు హైకోర్టు తీర్పు కారణంగా… మళ్లీ ఇక ఈ టికెట్‌ ధరలు నిర్ణయించుకునే ఆప్షన్‌ ఇంకా మంచి ఛాన్స్ అనేది థియేటర్లకు వచ్చేసింది. అయితే ఇది ఇండస్ట్రీకి మంచి చేసే విషయమే కానీ. సరైన రీతిలో కనుక వాడుకోకపోతే ప్రేక్షకులకు బాగా ఇబ్బంది కలిగిస్తుంది.కాబట్టి సినిమా నిర్మాతలు కాని డిస్ట్రిబ్యూటర్లు కాని ఇంకా బయ్యర్స్ కాని ఆచి తూచి ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి. అలాగే వారు వారి లాభంతో పాటు ప్రేక్షకుల సౌకర్యం స్థోమత కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. అలా కాదని ఛాన్స్ వచ్చిందని టికెట్ రేట్లు బాధేస్తే సామాన్య ప్రేక్షకులు బాగా ఇబ్బంది పడతారు.చూడాలి మన మూవీ మేకర్స్ ఎలా చేస్తారో అని..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: