టాలీవుడ్ లెక్కల మాస్టర్ గా పేరొందిన సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'.బన్నీ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాని సుమారు 180 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు.గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ కి జోడిగా రష్మీక మందన్న కథానాయికగా నటిస్తోంది.ఇక రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో మలయాళ అగ్ర హీరో ఫాహాద్ ఫజిల్, సునీల్ విలన్స్ గా నటిస్తున్నారు.ఇక ఈ సినిమా మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 న విడుదల కానుంది.
ఇక వీడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్ని వేగవంతం చేసారు మేకర్స్.ఇక ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమాకు సెన్సార్ యూనిట్ గట్టిగానే కోతలు విధించినట్లు తెలుస్తోంది.పుష్ప సినిమాలో చాలా ఎమోషనల్ సన్నివేశాలు ఉండటంతో దర్శకుడు సుకుమార్ కొన్ని బోల్డ్ డైలాగులు,వైలెన్స్ తో కూడిన సీన్స్ ని చిత్రీకరించారట.అయితే ఆ సీన్స్ లో కొన్ని సన్నివేశాలు సెన్సార్ కత్తెరకు గురైనట్లు సమాచారం. ఇక సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు కోత విధించిన సెన్సార్.. మరి కొన్ని అభ్యంతరకర సంభాషణల దగ్గర మ్యూట్ చేయాలని సూచించారట.
వీటన్నింటిపై కోతలు విధిస్తూ సెన్సార్ యూనిట్ పుష్ప సినిమా కి యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఇక ఈ సినిమా గురించి కూడా సెన్సార్ యూనిట్ పాజిటివ్ టాక్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాలో ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ పార్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో బన్నీ చేసే ఫైట్ సీన్లు కూడా సరికొత్తగా చాలా రియలిస్టిక్గా ఉంటాయట. ఇక సినిమాకి రష్మిక యాక్టింగ్ కూడా మరో ప్లస్ అని చెబుతున్నారు.మొత్తం మీద పుష్ప సినిమాకి సెన్సార్ యూనిట్ భారీ కోతలే విధించినట్లు తెలుస్తోంది...!!