బిగ్ బాస్: మంత్రి సపోర్ట్ అతనికి ప్లస్ అవుతుందా?

Satvika
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మరో వారం లో అయిపోతుంది. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ సీజన్ లో ఎవరూ విన్నర్ అవుతారో అనేది జనాలను తెగ ఆలోచనలో పడేలా చేస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి సీరియల్ నటుడు మానస్ పై పడింది. సగం మంది అతనే విన్నర్ అని అంటున్నారు. మరి కొందరు మాత్రం సన్నీ అని ప్రచారం చేస్తున్నారు. ఇదే విధంగా సోషల్ మీడియాలో సన్నీ విన్నర్ అని తేలి పోయింది.


ఇది ఇలా ఉండగా మానస్ కు మద్దతు రోజు రోజుకు పెరిగిపోతుంది.. చిత్ర పరిశ్రమ లోని వాళ్ళు కాకుండా రాజకీయ నేతలు కూడా అతనికి మద్దతు తెలుపుతున్నారు.తాజాగా మానస్ రాక్ స్టార్' అనే పోస్టర్‌ను ఆవిష్కరించిన కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మానస్ టైటిల్ విన్నర్ కావాలని కోరుకుంటూ అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అతని ఆట, హౌస్ లో మాట అతని విజయానికి నాంది అని మంత్రి కొనియాడారు.. అతను విన్నర్ అయితే చాలా మంది హ్యాపిగా ఉంటారని అన్నారు.


చిన్న వయస్సు లోనే ఇండస్ట్రీ లోకి వచ్చి ఎన్నో సినిమా లలో నటించి మంచి పేరును తెచుకున్నాడు మానస్. బిగ్ బాస్ సీజన్ 5 లో 16వ కంటెస్టెంట్‌ గా ఎంట్రీ ఇచ్చిన మానస్ తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. మొదటి నుంచి మంచిగా ఆడుతూ అందరితో సరదాగా ఉండేవాడు. ఎటువంటి గొడవల జోలికి పోకుండా సీజన్ లాస్ట్ వరకూ సత్తాను ఛాటాడు.ఈ కార్యక్రమంలో నిర్మాత ఎం.ఆర్.చౌదరి, టీర్‌ఎస్‌ లీడర్ నాగమణి, ఇంటర్నేషనల్ డ్రెస్సెస్ డిజైనర్ అపర్ణ, మానస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.తేజు మొదలగు వాళ్ళు పాల్గొన్నారు. ఏంటో ఎం జరుగుతుందో మరో వారం లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: