'ఆర్ఆర్ఆర్' అద్భుతం.. వీడియో చూసేయండి?

praveen
ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమ లో హాట్ టాపిక్ గా మారిన సినిమా ఒక్కటే. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా. ఇక ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల కాబోతుంది. సినిమాపై ప్రపంచ సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా లో స్వతంత్ర సమర యోధులు అల్లూరి సీతా రామరాజు కొమురం భీం పాత్రలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇక ఇద్దరు స్టార్ హీరోల నటనకు దర్శక ధీరుడు రాజమౌళి టేకింగ్ తోడు కావడం తో ఈ సినిమా పేరు వినిపిస్తే  చాలు పూనకం వచ్చినట్లుగా ఊగి పోతున్నారు ప్రేక్షకులు.


 ఇక సినిమాకు సంబంధించి ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి కూడా అందరిని అబ్బుర పరిచింది. అంచనాలను అందు కోవటం కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ట్రైలర్ ఉంది. ఇకపోతే ఇటీవలే ఆర్ఆర్ఆర్  చిత్ర బృందం పై ఓ కళాకారుడు గీసిన ఆర్ట్ ఎంతో వైరల్ గా మారి పోతుంది. సాధారణం గా ఎంతో మంది అభిమానులు హీరో లకు సంబంధించిన చిత్ర పటాలు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ హైదరాబాదుకు చెందిన ఒక కళాకారుడు అందరికంటే భిన్నం గా కాస్త కొత్తగా ట్రై చేశాడు.



 ఉప్పుతో పాటు రంగులు ఉపయోగించి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ దర్శక ధీరుడు రాజమౌళి బొమ్మలను వేసాడు.. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ఫైనల్ గా మారి పోయింది. ప్రస్తుతం ఉప్పుతో కళాకారుడు వేసిన ఆర్ట్ ఎంతో అద్భుతంగా ఉంది అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిని స్పెషల్ సాల్ట్ఆర్ట్ అంటారని సదరు కళాకారుడు చెబుతున్నాడు.. అయితే ఇక దీనికి సంబంధించిన వీడియో పై ఆర్ఆర్ఆర్ చిత్రబృందం స్పందించింది. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ తెలిపింది ఆర్ఆర్ఆర్ చిత్రబృందం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: