పుష్ప : అయ్య‌య్యో త‌గ్గ‌మ్మా ! అంత కాన్ఫిడెన్స్ వ‌ద్ద‌మ్మా!

RATNA KISHORE
చుట్టూ ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత
మ‌ధ్య‌లో ఓ క‌ర్క‌శ మ‌న‌సు
అటుపై ఏమౌతుంది
గొడ్డ‌లి వేటుకు రాలే చెట్ల
నుంచి మ‌ర్యాద మ‌న్న‌న లేని మ‌నిషి
ఏం నేర్చుకున్నాడ‌ని? ఇదీ క‌థ
గంధ‌పు చెక్క‌ల క‌థ
ప్రేమ గంధం పూయించిన క‌థ
ఈ క‌థ‌కు కేరాఫ్ పుష్ప



అవార్డుల‌న్నీ గొప్ప‌వి అవార్డుల‌న్న‌వి గొప్ప‌వి.. అన్నీ గొప్ప‌వి ప్ర‌త్యేకం కాదు సామాన్యం...అన్న‌వి గొప్ప‌వి అన్న‌ది సామాన్యం కాదు ప్ర‌త్యేకం. అన్న‌వి విన్న‌వి రాయ‌డంలో వింత లేదు కానీ బాధ్య‌త ఉంది. బాధ్య‌త ప‌రంగా రాత బాగుంటుంది. బాధ్య‌తాయుతమయి న న‌టన లేదా వృత్తి నిర్వ‌హ‌ణ అన్న‌ది ఇంకా బాగుంటుంది. న‌ట‌న వృత్తిగా ఎంచుకున్న వారి గురించి ఏం చెప్పాలి.. వారి అదే త‌ప‌న వారిలో అదే ప‌టిమ ఉన్నంత కాలం త‌ప్పక రాణిస్తారు అనేందుకు ఉదాహ‌ర‌ణ‌లు ఎన్నో.. చిరు నుంచి బ‌న్నీ వ‌ర‌కూ అంతా ఒకే స్థాయిలో ఒక స్థాయి దాటి కూడా ప్రేక్ష‌క లోకాన్ని రంజింప‌జేయ‌డంలోనో మెప్పించ‌డంలోనో ముందున్నారు.. ఆ విధంగా మెగా కుటుంబం నుంచి ఎంట‌ర్ టైన‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. కొన్ని క‌థ‌లు రియ‌లిస్టిక్ అప్రోచ్ లో తెర‌కెక్కాయి కూడా...!



ఇప్పుడు పుష్ప కూడా ఓ రియ‌లిస్టిక్ అప్రోచ్ లోనే తెర‌కెక్కిన సినిమా అని క‌థానాయ‌కుడు బ‌న్నీ చెబుతున్నారు. ఈ సినిమాతో ఆయ‌న‌కు జాతీయ అవార్డు వ‌స్తుంద‌ని  చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. వీటిలో నిజం ఎంత లేదా వాస్త‌వ రూపం ఎంత అన్న‌ది కొద్ది రోజులు ఆగాకే తెలియ‌వ‌స్తుంది. గతంలో ఏ చిత్రానికీ బ‌న్నీ విష‌యంలో ఇలాంటి ప్ర‌శంస‌లు కానీ మాట‌ల మానియా కానీ రాలేదు. అదీ చిత్రం విడుద‌ల‌కు ముందే ఇలాంటి ప్ర‌తిపాద‌న‌లు అస్స‌లు సంబంధిత చిత్ర బృందాల నుంచి రాలేదు కూడా! కానీ ఈ చిత్రం అందుకు భిన్నంగానే ఉంది. 


బ‌న్నీరెండేళ్ల క‌ష్టం.. సుక్కూ మూడేళ్ల క‌ష్టం ఏ విధంగా ఉండ‌నుంది అన్న ఆస‌క్తి మాత్రం అంద‌రిలోనూ ఉంది క‌నుక ఇప్ప‌టికిప్పుడు ఎవ‌రినీ త‌క్కువ చేయ‌కూడదు. సినిమా విష‌యమై వారికున్న ఫ్యాష‌న్ ను గౌర‌వించాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: