బిగ్ షాక్ : పుష్ప రిలీజ్ పోస్ట్ పోన్.. ఎందుకంటే..?
అంతేకాదు ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ కాబోతోంది అని తెలిసి అభిమానులు కూడా తమకున్న పనులన్నింటినీ పోస్ట్ ఫోన్ చేసుకోవడం గమనార్హం. ఇప్పుడు అభిమానులందరికీ ఒక షాకింగ్ విషయం చెప్తున్నారు. అదేమిటంటే.. పుష్ప సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటూ పెద్దఎత్తున వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ కి గురి అవుతున్నారు.. అయితే మీరు కూడా టెన్షన్ పడుతున్నట్లు అయితే కొద్ది సేపు ఆగండి..ఎందుకంటే పుష్ప సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడబోతోంది మనదేశంలో కాదు.. సింగపూర్ లో.. ఈ సినిమాను రేపు విడుదల చేయకుండా వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
డిసెంబర్ 23వ తేదీన సింగపూర్ లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు గల కారణమేమిటంటే.. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. మిగతా అన్ని ప్రాంతాలలో చెప్పిన డేట్ అనగా డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ చేసినా సింగపూర్ లో మాత్రం డిసెంబర్ 23వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో అక్కడి అభిమానులు నిరాశ చెందుతున్నారు. అందుకే వారి కోసం ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతోంది చిత్రం యూనిట్. అయితే ఆ స్పెషల్ ట్రీట్ ఏమిటో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగక తప్పదు.