పుష్ప కథ ఏంటో చెప్పేసిన అల్లుఅర్జున్..!
రేపు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారట మేకర్స్. గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత కూడా స్పెషల్ సాంగ్ తో మెరిపించిందని తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లోకి వెళ్లిపోయాయట.రేపు థియేటర్ లను బద్దలు కొట్టేందుకు అల్లు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారట.. ఇప్పటి వరకు ముద్దుగా స్టైలిష్ స్టార్ అని పిలుచుకున్న బన్నీ ని ఈ సినిమాలో ఊర మాస్ గా చూపించడంతో ఈ సినిమా ను ఎప్పుడు చూస్తామా అని అభిమానులంతా ఎదురు చుస్తున్నారట.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గత కొన్ని రోజులుగా పుష్ప టీమ్ మొత్తం ఇంటర్వ్యూలలో బిజీగా ఉందట.
రోజుకు రెండు రాష్ట్రాలు చుట్టేస్తూ బిజీ బిజీగా ఉన్నారట.అయితే గత కొన్ని రోజులుగా పుష్ప సినిమా కంటెంట్ గురించి సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారట.ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడే సుకుమార్ ఇది ఎర్ర చందనం నేపథ్యంలో ఉంటుందని చెప్పడంతో అందరు ఇది వీరప్పన్ ఇన్స్పిరేషన్ తో డిజైన్ చేసారేమోనని అనుమాలు వచ్చాయట.ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో ఈ ప్రచారం ఇప్పటికి కొనసాగుతూనే ఉందట ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ కన్నడ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ రూమర్ పై క్లారిటీ ఇచ్చేసారట . ఈ సినిమా కథకు వీరప్పన్ రియల్ లైఫ్ స్టోరీకి అస్సలు సంబంధమే లేదని ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ స్టోరీ అని చెప్పుకొచ్చారట పుష్పరాజ్. కన్నడ బ్యూటీ అయినా రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం మరియు విలన్ గా కూడా కన్నడ స్టార్ ధనుంజయ్ నటించడంతో ఈ సినిమాపై అక్కడ భారీ హైప్ వచ్చిందట. ఇక ఈ సినిమా రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో థియేటర్స్ దగ్గర సందడి చేయడానికి ఫ్యాన్స్ అంతా సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.