పుష్ప : రూమర్లు నమ్మకండి ... బొమ్మ అదిరిపోద్ది చూడండి .... ??

GVK Writings
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప పార్ట్ 1 రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే మాస్ పాత్ర చేస్తుండగా శ్రీవల్లి అనే గిరిజన యువతిగా రష్మిక మందన్న కనిపించనున్నట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు సుకుమార్ తీసిన ఈ సినిమా మొత్తంగా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సునీల్, ధనుంజయ, అనసూయ, ఫహద్ ఫాసిల్ తదితరులు ఇతర పాత్రలు చేస్తుండగా క్యూబా కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎంతో భారీ అంచనాలు ఉండడంతో తప్పకుండా పుష్ప పెద్ద సక్సెస్ కొట్టి అందరి అంచనాలు అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అయితే మ్యాటర్ ఏమిటంటే పుష్ప మూవీ పై పలు మీడియా మాధ్యమాల్లో, కొన్ని కారణాల వలన యుఎస్ఏ ప్రీమియర్స్ లేట్ కానున్నాయని నిన్నటి నుండి ప్రచారాలు వైరల్ అవుతూ ఉండడంతో, ప్రేక్షకాభిమానులు అవేవి నమ్మవద్దని, ముందుగా తాము అనుకున్న విధంగానే ఈ రోజు రాత్రి అమెరికాలో ప్రీమియర్ లు ప్రదర్షింపబడడంతో పాటు టికెట్స్ కూడా బాగా అమ్ముడవుతున్నాయని, ముందుగా తాము ప్రకటించిన విధంగానే పుష్ప అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందని, అందుకే ప్రేక్షకాభిమానులు ఇటువంటి పుకార్లు ఏ మాత్రం నమ్మకుండా హాయిగా థియేటర్స్ కి వచ్చి పుష్ప మేనియాని ఎంజాయ్ చేయండి అంటూ కొద్దిసేపటి క్రితం పుష్ప యుఎస్ఏ డిస్ట్రిబ్యూటర్స్ అయిన హంసిని ఎంటర్టైన్మెంట్స్ వారు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రకటించింది. మరి అందరిలో ఎంతో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన పుష్ప సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ టాక్ అందుకుంటుందో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: