షాకింగ్ ట్వీస్ట్: పుష్ప ఐటెం సాంగ్ మేల్ వెర్షన్.. విన్నారా..?

VUYYURU SUBHASH
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్లు ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో మంచి ఉంది అలాగే చెడు కూడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మంచి కన్నా కూడా చెడు ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. టెక్నాలజి డెవలప్ అవుతుంది అని సంతోషపడాలో లేక ఈ సోషల్ మీడియా కారణంగా కొంతమంది యువత చెడుదారిలో పోతున్నందుకు బాధపడాలో తెలియని పరిస్ధితుల్లో మనం ఉన్నాం.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్న పుష్ప సినిమాలో ని ఐటెం సాంగ్ పై పెద్ద దుమారమే రేగుతుంది. ఈ పాటలో సమంత హాట్ లుక్స్ పై అక్కినేని అభిమానులు మండిపడుతుంటే .. ఈ పాటలోని లిరిక్స్ టోటల్ మగాళ్లను కించపరిచే విధంగా ఉన్నాయి అన్నది కొందరి మగాళ్ల భావన. ముఖ్యంగా " మీ మగాళ్ల బుద్ధి వంకర బుద్ధి" అంటూ సాగే లిరిక్స్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేనా ఈ పాట రాసిన చంద్రబోస్ పై కూడా మీడియా ముఖంగా తిట్టిపోస్తున్నారు. ఈ పాటను పూర్తిగా  పుష్ప సినిమా నుండి తొలగించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే రీసెంట్ గా ఈ పాట మేల్ వర్షన్ సోషల్ మీడియాలో వైరల్  గా మారింది. పాటలోని లిరిక్స్ అక్కడక్కడ మారుస్తూ  అమ్మాయిలను ఉద్దేశిస్తూ పలు స్టార్ హీరోల పాటను మ్యాచ్ చేస్తూ ఓ సాంగ్ ని రీక్రియేట్ చేసారు కొందరు అబ్బాయిలు. ఇక ఆ పాట సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారి..నెట్టింట దుమ్ము రేపుతుంది .  ఇక ఈ మేల్ వెర్షన్ అదిరిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు .  మరి ఎందుకు ఆలస్యం మీరుకూడా ఆ పాట పై ఓ లుక్కేయండి..!!


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: