ఎట్టకేలకు వాటిని నిజం చేసిన సుకుమార్..!!
సినిమా విడుదలకు ముందు చిత్రం యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్ల తో అభిమానులను మరింత ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు సుకుమార్ కూడా పుష్ప సినిమా క్లైమాక్స్ మొత్తం లీక్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.. పుష్ప చిత్రంలో కీలకమైన విలన్ పాత్రలో సునీల్ నటిస్తున్నాడు అని.. ఇన్ని రోజుల వరకు సునీల్ అంటే కేవలం కమెడియన్ గా మాత్రమే చూశారు. హీరోగా చూశారు అలాగే సపోర్టింగ్ రోల్స్ లో కూడా చూశారు .. ఇకపోతే అప్పట్లో కైకాల సత్యనారాయణ.. కోట శ్రీనివాసరావు వంటి పెద్ద నటులు కామెడీ చేసినా.. విలనిజం చూపించినా..సపోర్టింగ్ రోల్స్ చేసిన కూడా మనం బాగా చూసాము.
అయితే మనకు సునీల్ విషయంలో కూడా అదే జరిగింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ను ఇప్పటి వరకు చూడని సరికొత్తగా మెయిన్ విలన్ గా చూపించడం ఇదే మొదటి సారి.. ఇక చివర్లో విలన్ గా ఫాజిల్ కనిపిస్తారు అంటూ ఇక ఫాజిల్ కి బన్నీ కి ఎక్కువ కాంబినేషనల్ సీన్స్ కూడా ఉన్నాయని సెకండ్ పార్ట్ లో విలన్ గా చూపించాము అంటూ కేవలం విడుదలకు కొన్ని గంటల ముందు ఈ విషయాన్ని రివీల్ చేశాడు సుకుమార్.