పుష్ప రివ్యూ: కేజీఎఫ్‌ను తలపించే టేకింగ్‌తో చంపేసిన సుక్కు
దీంతో పుష్ప సినిమాను తొలి రోజు ... తొలి ఆట చూసేయాలని లక్షలాది మంది సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఉన్నారు. అందుకు తగినట్టుగానే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ లు జరిగాయి. ఇక పుష్ప కథ అణగారిన కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు తన తెలివి తేటలు మరియు ధైర్యాన్ని ఉపయోగించి జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నాడో ? తాను ఎదుర్కొన్న ప్రమాదం నుంచి ఎలా భయ ట పడ్డాడో అన్న నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఇక సుకుమార్ టేకింగ్ ఎలా ఉంటుందో వన్ - నేనొక్కడినే , రంగస్థలం సినిమా ల్లో చూశాం. ఇప్పుడు పుష్ప సినిమా టేకింగ్ కూడా ఆ రెండు సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంది. అయితే రంగస్థలంతో పోలిస్తే ఎమోషనల్ ఫీల్ ను పుష్ప లో మ్యాజిక్ చేయడంలో మాత్రం సుక్కు కాస్త ఫెయిల్ అయినట్టే కనపడుతోంది. అయితే కథ తో పాటు కొన్ని సీన్లు ఎలివేట్ చేయడంలో సుక్కు లో కేజీఎఫ్ స్టైల్ కనిపించింది. సుక్కు కొన్ని చోట్ల ప్లాట్ నెరేషన్ తో ఇబ్బంది పెట్టినా తన దైన టేకింగ్ విషయంలో మాత్రం రాజీ పడలేదు.