పుష్ప : అనుకున్నదే జరిగింది.. వారికి భారీ నష్టం?

praveen
ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఏకంగా ఐదు భాషలలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి షో నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది అల్లు అర్జున్ పుష్ప సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన పిక్స్ లెవల్ లో ఉంది అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



 ఇకపోతే దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న అల్లు అర్జున్ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా ఆత్రుత గానే ఉన్నారు. ఈ క్రమంలోనే థియేటర్లకు బారులు తీరుతున్నారు. అయితే ఏపీలో ప్రభుత్వ నిబంధనల కారణంగా ఎలాంటి బెనిఫిట్ షోలు వెయ్య లేదు అన్న విషయం తెలిసిందే. అయితే  తెలంగాణలో మాత్రం కొన్ని థియేటర్లలో బెనిఫిట్ షో లు వేసారు. అయితే ఆంధ్రా లో బెనిఫిట్ షోలు వేయకపోవడంతో అప్పటికే చిరాకు లో ఉన్న ప్రేక్షకులు సినిమా చూస్తున్న సమయంలో ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇక పుష్ప సినిమా నేపథ్యంలో భారీగా అభిమానులు తరలి వస్తే ఏదైనా ఆస్తి నష్టం కలుగుతుందని థియేటర్ యాజమాన్యం కాస్త భయం భయంగానే ఉంది. ఇప్పుడు అనుకున్నదే జరిగినట్లు తెలుస్తోంది. తిరుపతిలోని పళని సినిమా థియేటర్ పుష్ప చూడడానికి వెళ్లిన అభిమానులు సౌండ్ సరిగా వెయ్యలేదని రచ్చ చేశారు. శ్రీవళ్లి పాట వచ్చిన సమయంలో సౌండ్ సరిగ్గా లేదు అంటూ అద్దాలు కుర్చీలను ధ్వంసం చేశారు. దీంతో థియేటర్ యాజమాన్యానికి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: